1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.BZ

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.BZ

3
00:01:07,609 --> 00:01:08,610
ఛ.

4
00:01:44,688 --> 00:01:45,939
దగ్గరికి రావద్దు!

5
00:02:19,431 --> 00:02:20,974
పసిఫిక్ మహాసముద్రం, 1987

6
00:02:21,058 --> 00:02:24,478
కోల్డ్ వార్ మొదలయి 40 ఏళ్ళు అయింది

7
00:02:25,979 --> 00:02:28,357
అవుట్ లా 1, రెండు విమానాలూ
ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయి.

8
00:02:28,440 --> 00:02:30,567
రెడ్ హుక్ 3507, ఎదురుగా
కాస్త కుడి వైపు రెండు శత్రు విమానాలున్నాయి.

9
00:02:30,651 --> 00:02:31,610
లెఫ్టినెంట్ ట్రాయ్ కెల్లీ
"అసాసిన్"

10
00:02:31,693 --> 00:02:33,862
నేను ఆండర్టన్ కూతురికి, తన పుట్టినరోజున,
లడ్డుగా ఉండే క్యాబేజీ ప్యాచ్ బొమ్మని

11
00:02:33,946 --> 00:02:34,947
కానుకగా ఇచ్చా.

12
00:02:35,030 --> 00:02:36,490
ఎందుకు అవి అలా ఉంటాయో చెప్పగలవా?

13
00:02:36,573 --> 00:02:37,574
లాంగ్ షాట్

14
00:02:37,658 --> 00:02:39,409
- అంటే?
- ఎందుకు వాటి ముఖాలు అలా ఉంటాయి?

15
00:02:39,493 --> 00:02:41,662
వాటి కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి,
బుగ్గలేమో ఉబ్బిపోయి ఉంటాయి,

16
00:02:41,745 --> 00:02:43,121
స్టెరాయిడ్స్ తీసుకున్నట్టు ఉంటాయవి.

17
00:02:47,209 --> 00:02:48,210
ముల్లెట్

18
00:02:48,293 --> 00:02:50,212
నాకు అవి భలే ముద్దొస్తాయి.
చంటి బిడ్డల్లా బొద్దుగా ఉంటాయి, అంతే.

19
00:02:50,295 --> 00:02:52,923
బాబోయ్, నాకే అలాంటి చంటి బిడ్డ
కనిపిస్తే, భయంతో ఉచ్చ కారిపోతుంది.

20
00:02:53,006 --> 00:02:56,760
అవుట్ లా 2, శత్రు విమానాలు. అవి క్యాబేజీ తోటల్లో
పుట్టిన బొమ్మలని అర్థం చేసుకోవాలి అనుకుంటా

21
00:02:56,844 --> 00:02:58,595
అవి మంచివే అన్నట్టు మాట్లాడుతున్నావే.

22
00:02:58,679 --> 00:03:00,597
బార్బీ బొమ్మలు బాగుంటాయి కదా? వాటికేమైంది?

23
00:03:00,681 --> 00:03:01,682
బూమర్

24
00:03:01,765 --> 00:03:03,517
- ఇంతకీ ఈ డ్రిల్ చేద్దామా వద్దా?
- ఓయబ్బో.

25
00:03:03,600 --> 00:03:04,685
శత్రువులకు చిరాకు వస్తున్నట్టుందే.

26
00:03:04,768 --> 00:03:07,479
ఎడమ పక్కన ఉన్నోడి సంగతి నేను చేసుకుంటా.
రికార్డింగ్ ఆన్ చేశా. ఇక యుద్ధం షురూ.

27
00:03:07,563 --> 00:03:10,065
అవుట్ లా 2, నేను కుడి పక్కన
ఉన్నోడిని చూసుకుంటా. ఇక రచ్చ రచ్చే.

28
00:03:20,701 --> 00:03:21,869
ఇప్పుడేం చేస్తావు?

29
00:03:33,714 --> 00:03:36,008
హేయ్, నువ్వు తప్పించుకోలేవు, బాసూ.
ఇక ఓటమిని ఒప్పుకుంటావా?

30
00:03:37,050 --> 00:03:38,385
అబ్బో. అదీ చూద్దాం.

31
00:03:46,393 --> 00:03:48,312
ఎడమ పక్కనున్నోడికి మూడింది. నువ్వు చచ్చావు, పిస్తా.

32
00:03:48,395 --> 00:03:50,314
- ఛ!
- మిషన్ విజయవంతంగా పూర్తి చేశా.

33
00:03:50,397 --> 00:03:51,732
లాంగ్ షాట్, నీ పని ఎక్కడి దాకా వచ్చింది?

34
00:03:51,815 --> 00:03:53,108
కుడి పక్కన ఉన్నోడు చచ్చాడు, గురూ.

35
00:03:53,192 --> 00:03:55,444
దీంతో మన శత్రువులకు తల ఎక్కడ పెట్టుకోవాలో

36
00:03:55,527 --> 00:03:56,820
అర్థం కాదేమో.

37
00:03:56,904 --> 00:03:58,822
ఇవాళ నక్క తోక తొక్కి వచ్చావు, లెఫ్టినెంట్.

38
00:03:58,906 --> 00:04:00,199
నౌకపై కలుద్దాం.

39
00:04:04,244 --> 00:04:07,623
అసాసిన్, ఫ్లైట్ కంట్రోల్స్ సరిగ్గా పని చెయ్యట్లేదు.

40
00:04:08,457 --> 00:04:09,499
ఏమైంది?

41
00:04:10,000 --> 00:04:13,003
కుడి ఏలెరాన్ స్టక్ అయిపోయింది.
కుడి రెక్క అస్సలు పని చెయ్యట్లేదు.

42
00:04:13,086 --> 00:04:16,255
సరే, విమానాన్ని కాస్త…
కాస్త స్టెడీగా ఉంచు. నన్ను చూడనివ్వు.

43
00:04:18,550 --> 00:04:19,718
హా, కనిపించింది.

44
00:04:19,801 --> 00:04:22,053
ఇలా ఊగిపోతూ ఉంటే, నౌక మీద ల్యాండ్ చేయడం కష్టం.

45
00:04:22,137 --> 00:04:25,057
- ఎల్ఎస్ఓ, విన్నారా ఇది?
- విన్నాను.

46
00:04:25,140 --> 00:04:27,851
సరే, నేను బూమర్ తో ఉండి సంగతేంటో చూస్తా,
మిగతా ఇద్దరూ ల్యాండ్ అవుతారు.

47
00:04:27,935 --> 00:04:28,936
గుడ్ లక్, బ్రో.

48
00:04:32,272 --> 00:04:34,316
- అబ్బా.
- కంగారుపడకు, బూమర్.

49
00:04:34,399 --> 00:04:35,901
కాస్త పైకి పద.

50
00:04:35,984 --> 00:04:38,570
అది కుదరదు. ఇంధనం 2.1 ఉంది. కొంచెమే ఉంది.

51
00:04:39,321 --> 00:04:40,322
ఎజెక్ట్ అయిపోతే మంచిదనిపిస్తోంది.

52
00:04:40,405 --> 00:04:42,449
వద్దు. ప్రజల సొమ్మును వృథా చేయకయ్యా.

53
00:04:42,533 --> 00:04:44,243
నేనొకటి ప్రయత్నించి చూస్తా. కాస్త…

54
00:04:44,326 --> 00:04:46,328
నువ్వు విమానాన్ని స్టెడీగా ఉంచడానికి ప్రయత్నించు.

55
00:04:46,411 --> 00:04:47,871
ఏం చేస్తున్నావు?

56
00:04:48,497 --> 00:04:50,707
- స్టక్ అయి ఉన్న నీ ఏలెరాన్ ని రిపేర్ చేస్తా.
- ఎలా?

57
00:04:51,291 --> 00:04:54,169
కంగారుపడకు. ల్యాండింగ్ గేర్ ని
దించి, కంట్రోల్స్ తో బ్యాలెన్స్ చేయి.

58
00:04:59,424 --> 00:05:00,968
బాగా ఊగిపోతోంది.

59
00:05:01,051 --> 00:05:03,178
అవును. ఇది కాస్త వింతగా ఉంటుంది,
నేను చెప్పేది ఫాలో అయిపో, అంతే.

60
00:05:05,806 --> 00:05:07,307
నీ వల్ల మనిద్దరి ప్రాణాలు పోతాయి.

61
00:05:19,611 --> 00:05:22,030
అబ్బా. ఏందయ్యా ఇది!

62
00:05:22,114 --> 00:05:24,575
మరేం పర్వాలేదు. కంగారుపడకు. నేను పిస్తాని.

63
00:05:24,658 --> 00:05:26,118
ఇది జరగని పని.

64
00:05:26,201 --> 00:05:28,579
ల్యాండింగ్ చేయవద్దు, 382. టవర్ కి గుద్దుకుంటావు.

65
00:05:28,662 --> 00:05:29,997
అవును. ల్యాండింగ్ చేయకు.

66
00:05:30,080 --> 00:05:32,708
నువ్వు ల్యాండింగ్ పై దృష్టి పెట్టు.
రెక్కని ఎయిర్ ఫ్లోకి ఆపోజిట్ గా ఉంచు.

67
00:05:32,791 --> 00:05:35,043
ఇప్పుడు కాస్త నెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

68
00:05:49,933 --> 00:05:52,561
సూపర్. నీకు రుణపడిపోయా, బాసూ.

69
00:05:52,644 --> 00:05:53,770
నేనే నీకు రుణపడి ఉంటా.

70
00:05:53,854 --> 00:05:55,230
నీ వల్ల ఈ నెలకి ఉత్తమ ఉద్యోగి అవార్డ్ నాకే.

71
00:05:55,314 --> 00:05:58,025
నా విమానాన్ని ఎంట్రెన్స్ పక్కనే పార్క్ చేసుకోనిస్తారు.

72
00:05:58,525 --> 00:06:00,527
బందీగా ఉన్న కుటుంబాలకు నేను ఒకటే చెప్తున్నా,

73
00:06:00,611 --> 00:06:01,612
మేము పట్టు విడవట్లేదు.

74
00:06:01,695 --> 00:06:02,863
ఎప్పటికీ విడవం కూడా.

75
00:06:02,946 --> 00:06:05,574
శత్రువుల చెర నుండి మీ ఆత్మీయులను
విడిపించడానికి, చట్టబద్ధమైన పద్ధతిలో

76
00:06:05,657 --> 00:06:09,328
మనకి ఉన్న ప్రతి మార్గాన్ని మేము ప్రయత్నిస్తామని
మాటిస్తున్నా. కానీ నేను మిస్ అవుతున్నా…

77
00:06:09,411 --> 00:06:12,414
- హేయ్, ఆయన ఏమన్నాడు?
- ఇంకో 75 ఏళ్ళు బతుకుతానట.

78
00:06:12,497 --> 00:06:15,125
అబ్బా, చెప్పవయ్యా. ఆయన నీకు తగిలించిన
ఈ కొత్త ఎక్విప్ మెంట్ పని చేయట్లేదా?

79
00:06:15,626 --> 00:06:17,169
నాకు అంతా బాగైపోయిందని చెప్పా కదా.

80
00:06:17,252 --> 00:06:18,420
- బాగైపోయిందా?
- హలో.

81
00:06:19,087 --> 00:06:21,882
నియమాల ప్రకారం ఆసుపత్రి బయటి దాకా
మీరు చక్రాల కుర్చీలోనే వెళ్ళాలి.

82
00:06:21,965 --> 00:06:24,510
- నిజంగానా?
- అరే. వద్దు. ఇక్కడ హంగామా చేయవద్దు…

83
00:06:24,593 --> 00:06:26,970
నాన్నా, ఈ విషయం నువ్వు నా దగ్గర దాచాల్సిన పని లేదు.

84
00:06:27,054 --> 00:06:28,847
ఎంత ఒత్తిడినైనా నేను తట్టుకోగలను.

85
00:06:28,931 --> 00:06:32,351
దేవుడా. ఒక కొత్త మందును ట్రై చేసి చూస్తారట.

86
00:06:32,434 --> 00:06:34,394
ఎలుకలపై బానే పని చేసింది,
కాబట్టి నాపై కూడా బానే పని చేస్తుంది.

87
00:06:36,939 --> 00:06:39,525
హేయ్, రాత్రి బయటకెళ్ళి తిందామా?
బిర్యానీ కానీ, ఏమైనా కానీ తిందామా?

88
00:06:39,608 --> 00:06:42,319
- మీ స్నేహితులని కలవడానికి వెళ్లట్లేదా?
- నా స్నేహితుడివి నువ్వే కదా.

89
00:06:42,402 --> 00:06:43,904
అబ్బో, చాలా చాలా థ్యాంక్స్.

90
00:06:44,738 --> 00:06:48,158
కానీ నేను ఆనందంగా ఉండాలంటే,
వెళ్లి మీ మిత్రులతో సరదాగా గడిపిరా.

91
00:06:48,242 --> 00:06:50,869
కనీసం నాకోసం పెద్దగా
త్యాగం చేయలేదన్నట్టు అయినా నటించు.

92
00:06:51,703 --> 00:06:55,415
అదీగాక, ఆ పడుచు పిల్లతో
నేను ఈరాత్రి డేట్ కి వెళ్తున్నా.

93
00:06:55,499 --> 00:06:56,583
సూపర్.

94
00:06:56,667 --> 00:06:57,876
డేట్ కి, అటు నుండి శ్మశానానికి వెళ్ళండి.

95
00:06:57,960 --> 00:06:59,002
దరిద్రుడివిరా నువ్వు.

96
00:06:59,086 --> 00:07:01,296
గ్యాస్ ల్యాంప్ క్వార్టర్

97
00:07:03,340 --> 00:07:05,467
హా, సర్లే. గోర్బచెవ్ చెప్పేవన్నీ నమ్మి మోసపోవద్దు.

98
00:07:05,551 --> 00:07:08,053
సరే, అసలు సమస్య గోర్బచెవ్ కాదేమో.

99
00:07:08,136 --> 00:07:09,471
- అతను కొన్ని…
- లేదు.

100
00:07:09,555 --> 00:07:12,307
- …సంస్కరణలు ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టున్నాడు.
- అతను పాలిట్ బ్యూరో ద్వారా వచ్చాడు.

101
00:07:12,391 --> 00:07:14,268
కరడుగట్టిన కమ్యూనిస్ట్ అతను.

102
00:07:14,351 --> 00:07:16,603
- అతను ఏమని చెప్పుకున్నా, అదే నిజం.
- వచ్చాడండి, కెప్టెన్ అమెరికా.

103
00:07:16,687 --> 00:07:18,105
- అది నిజమే.
- నిజం చెప్పాలంటే,

104
00:07:18,188 --> 00:07:20,232
క్యాపిటలిజానికి, కమ్యూనిజానికి
పెద్ద తేడా ఉన్నట్టు అనిపించట్లేదు.

105
00:07:20,315 --> 00:07:22,776
- ఏంటి? ఆ సోవియెట్ వ్యవస్థ అంతా…
- ఎందుకబ్బా అతడిని గెలుకుతావు?

106
00:07:22,860 --> 00:07:25,112
- …మానవ జాతి వినాశనానికే పుట్టింది.
- సూపర్, ఇక మనోడు ఆగనే ఆగడు.

107
00:07:25,195 --> 00:07:26,822
పునాదులే సరిగ్గా లేని వ్యవస్థను

108
00:07:26,905 --> 00:07:28,907
- ఎవరైనా బాగు చేయగలరా?
- ఈ సోదంతా నాకెందుకు, బాబూ.

109
00:07:28,991 --> 00:07:31,076
- నీకు అక్కర్లేదు.
- ఈ సోది మాకు అక్కర్లేదు, బాబూ.

110
00:07:31,159 --> 00:07:33,370
- లెనిన్ అయినా, స్టాలిన్ అయినా…
- మనం అక్కర్లేదని చెప్పాం కదా ఇప్పుడే?

111
00:07:33,453 --> 00:07:35,914
వీళ్ళందరూ నటిస్తారు అన్నమాట,
మనందరం స్వర్గంలో నివసిస్తున్నట్టు… హలో.

112
00:07:35,998 --> 00:07:38,667
మనందరం స్వర్గంలో నివసిస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు.

113
00:07:38,750 --> 00:07:42,171
కానీ ఎందుకో తెలీదు కానీ, ఆ స్వర్గంలో

114
00:07:42,254 --> 00:07:43,672
వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు.

115
00:07:43,755 --> 00:07:46,758
- చూసుకో!
- సారీ, హాయ్. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి, సర్.

116
00:07:46,842 --> 00:07:48,010
సరే. ఉదాహరణగా నన్నే తీసుకోండి.

117
00:07:48,093 --> 00:07:51,138
మూడవ దళంలో నన్ను తలదన్నే పైలట్
ఎవరూ లేరన్నది నిజమే కదా.

118
00:07:51,847 --> 00:07:53,348
బూమర్, నువ్వైతే ఖచ్చితంగా ఒప్పుకోవాలి.

119
00:07:53,432 --> 00:07:55,642
- ఏంటి? అసలు… అసలు సిగ్గే లేదా ఇతనికి?
- కాపాడు, ట్రాయ్.

120
00:07:55,726 --> 00:07:58,395
- నాకు సిగ్గే లేదు. ఉండకూడదు కూడా.
- నన్ను కాపాడు.

121
00:07:58,478 --> 00:08:00,522
అవును, ఎందుకంటే అమెరికాలో
టాప్ లో ఉంటే టాప్ లేచిపోయేలా రెచ్చిపోతాం.

122
00:08:00,606 --> 00:08:02,191
- అవును.
- గొప్పోళ్ళని మనం ఆకాశానికి ఎత్తేస్తాం.

123
00:08:02,274 --> 00:08:04,109
మరి అక్కడ గొప్పోళ్ళని ఏం చేస్తారో తెలుసా?

124
00:08:04,193 --> 00:08:05,277
ఏం చేస్తారు? చెప్పు వీళ్ళకి.

125
00:08:05,360 --> 00:08:07,613
ఏమీ చేయరు. మామూలు కామ్రేడ్ లానే చూస్తారు.

126
00:08:07,696 --> 00:08:09,781
- అది సమాజం కాదు…
- ఇతను తానా అంటే మీరు తందానా అంటున్నారా?

127
00:08:09,865 --> 00:08:11,074
- …జైలు.
- ఏంటి?

128
00:08:11,158 --> 00:08:14,119
అక్కడి నుండి బయటపడటానికి పోరాటం చేయని వారు ఎవరైనా…

129
00:08:14,203 --> 00:08:15,579
- వాళ్ళూ ఆ సమస్యలో భాగమే అనుకోవాలి.
- ఎవరైనా?

130
00:08:15,662 --> 00:08:17,497
అక్కడ పుట్టిన అమాయక పౌరులు కూడానా?

131
00:08:17,581 --> 00:08:19,208
మౌనంగా ఉన్నా తప్పు చేసినట్టే.

132
00:08:19,291 --> 00:08:21,668
- వీర పైలట్లారా! హా. ఎలా ఉన్నావు?
- హేయ్, బాసూ.

133
00:08:22,836 --> 00:08:25,380
ఇలాంటప్పుడే, మనం
పైలట్స్ అయినందుకు ఖుషీగా ఉంటుంది.

134
00:08:25,464 --> 00:08:27,299
- ఆహా. ఎలా ఉన్నావు?
- మిత్రులారా.

135
00:08:28,509 --> 00:08:29,343
కమాండర్.

136
00:08:29,426 --> 00:08:30,385
హార్డ్ విక్

137
00:08:30,469 --> 00:08:31,470
అంతా ఓకేనా, సర్?

138
00:08:32,136 --> 00:08:33,931
ఒక నిమిషం పక్కకెళ్లి మాట్లాడదామా?

139
00:08:35,015 --> 00:08:36,225
లెఫ్టినెంట్ కెల్లీ మాత్రమే.

140
00:08:37,476 --> 00:08:39,520
ఇవాళ నువ్వు చేసిన విన్యాసం గురించి నాకు తెలిసింది.

141
00:08:40,270 --> 00:08:42,523
సరే. వెనుకబడిపోయిన ఒక పైలట్ ని,
అలాగే ఒక విమానాన్ని కూడా కాపాడవచ్చని

142
00:08:42,606 --> 00:08:44,232
- అనిపించింది, అందుకే…
- కంగారుపడకు, కెల్లీ.

143
00:08:44,316 --> 00:08:45,776
నేనేం నిన్ను మందలించడానికి రాలేదు.

144
00:08:46,985 --> 00:08:48,362
బిగ్ బర్డ్ గురించి ఎప్పుడైనా విన్నావా?

145
00:08:49,530 --> 00:08:51,365
"సెసమీ స్ట్రీట్"లోని బిగ్ బర్డ్ కాదు.

146
00:08:52,616 --> 00:08:53,617
అయితే, అదేంటో తెలీదు.

147
00:08:54,326 --> 00:08:55,619
ఆపరేషన్ బిగ్ బర్డ్.

148
00:08:56,328 --> 00:09:00,040
1971 నుండి, యుఎస్ఎస్ఆర్ లోని
మారుమూల ప్రాంతాల్లో రష్యన్లు చేసే కార్యకలాపాలపై

149
00:09:00,123 --> 00:09:06,588
నిఘా ఉంచడానికి, ఎన్ఆర్ఓ,
నిఘా ఉపగ్రహాలను పంపుతూ ఉంది.

150
00:09:07,589 --> 00:09:09,883
కానీ సమస్య ఏంటంటే, ఆ ఉపగ్రహాల చిత్రాల
రిజల్యూషన్ తక్కువగా ఉంటుంది,

151
00:09:09,967 --> 00:09:13,262
కాబట్టి దగ్గరగా చూసి రావడానికి
అప్పుడప్పుడూ మేము ఒకరిని పంపిస్తూ ఉంటాం.

152
00:09:13,804 --> 00:09:14,888
మీకు నిఘా విమానం కావాలి కదా.

153
00:09:16,974 --> 00:09:18,475
ఆ విమానానికి పైలట్ గా నేను ఉండాలి.

154
00:09:18,976 --> 00:09:22,271
జర్మనీలోని రామ్ స్టెయిన్ వైమానిక స్థావరానికి
తెల్లవారు నాలుగింటికల్లా చేరుకో.

155
00:09:22,354 --> 00:09:23,313
నీకు వివరాలన్నీ అక్కడ చెప్తా.

156
00:09:23,397 --> 00:09:26,108
ఇది అత్యంత రహస్యమైన విషయం,
కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నట్టు ఎవరికీ చెప్పకు.

157
00:09:26,191 --> 00:09:28,277
థ్యాంక్యూ, సర్. ఈ అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్స్.

158
00:09:28,360 --> 00:09:30,612
లేదు, ఆ అవకాశాన్ని
సంపాదించుకున్నందుకు నీకే థ్యాంక్స్.

159
00:09:44,459 --> 00:09:46,628
కిందటి వారం, నియందోమాలో రష్యన్లు

160
00:09:46,712 --> 00:09:50,465
మిస్సైల్ లాంచ్ కేంద్రాలను నిర్మిస్తున్నారని
సూచించే చిత్రాలు మనకి లభించాయి.

161
00:09:50,549 --> 00:09:54,970
అంటే, ఈ ఆపరేషన్ కోసం మనం సోవియెట్ సరిహద్దు
నుండి 1,900 కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

162
00:09:55,053 --> 00:09:57,181
అంటే, వెళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట.

163
00:09:57,973 --> 00:10:01,518
ఆ సైట్ కి రక్షణగా, మనకి తెలిసి
నాలుగు మిస్సైల్ లాంచర్లు వారికి రక్షణగా ఉన్నాయి.

164
00:10:01,602 --> 00:10:05,230
దీనికి దగ్గర్లోని విమానాల రన్ వే, తూర్పు వైపు
320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏసోమీనోలో ఉంది.

165
00:10:05,314 --> 00:10:09,860
వీటన్నింటినీ బట్టి చూస్తే, రష్యన్లు ఈ సైటులో
పెద్ద గూడుపుఠాణియే జరుపుతున్నారని అర్థమవుతోంది.

166
00:10:10,736 --> 00:10:13,989
నువ్వు శామ్ సీలింగ్ కంటే పైన,
80,000 అడుగుల ఎత్తున ప్రయాణించాల్సి ఉంటుంది.

167
00:10:14,072 --> 00:10:16,033
ఫోటోలు తీసుకుని, వచ్చేయడమే పని.

168
00:10:18,827 --> 00:10:20,287
ఇక్కడున్నది నువ్వు ఒక్కడివే, కెల్లీ.

169
00:10:21,330 --> 00:10:22,831
మీరు 80,000 అడుగులని అన్నారు, సర్.

170
00:10:22,915 --> 00:10:25,375
యూ-2 యుద్ధ విమానాలు అంత ఎత్తు ఎగరలేవు కదా?

171
00:10:25,459 --> 00:10:28,420
అవును. కానీ నువ్వు వెళ్ళేది యూ-2లో కాదు.

172
00:10:35,260 --> 00:10:37,638
ఇదే ఎస్ఆర్-71 బ్లాక్ బర్డ్.

173
00:10:37,721 --> 00:10:43,101
గరిష్ఠ వేగం, మ్యాక్ 3 ప్లస్.
గరిష్ఠ ఎత్తు, 85,000 అడుగులు.

174
00:10:43,185 --> 00:10:45,729
ఈ భూమ్మీద దీని కన్నా వేగంగా, దీని కన్నా
ఎత్తులో ప్రయాణించగల విమానం మరొకటి లేదు.

175
00:10:47,356 --> 00:10:48,398
సూపర్ గా ఉంది ఇది.

176
00:10:49,107 --> 00:10:50,567
ఇది బెబ్బులి.

177
00:10:50,651 --> 00:10:51,860
మిస్సైల్ దాడులను తప్పించుకోగలదు.

178
00:10:52,694 --> 00:10:54,071
ఫుల్ ప్రెషర్ సూట్ వేసుకొని ఎక్కాలి.

179
00:10:54,154 --> 00:10:56,031
కానీ ఎలా అయినా, మ్యాక్ 1 కన్నా
వేగంగా వెళ్తున్నప్పుడు ఎజెక్ట్ అయితే,

180
00:10:56,114 --> 00:10:58,534
నీ శరీరం ముక్కలుముక్కలైపోతుంది.

181
00:10:59,743 --> 00:11:02,704
ఒక చిన్న సందేహం, సర్.
ఇది ఎయిర్ ఫోర్స్ చేయాల్సిన ఆపరేషన్ కాదా?

182
00:11:03,830 --> 00:11:06,792
ఇది టాప్ సీక్రెట్ ఆపరేషన్.
దీన్ని సీఐఎ వాళ్ళ కోసం జరుపుతున్నాం.

183
00:11:06,875 --> 00:11:09,127
- అంటే, నన్ను సర్వీస్ నుండి తొలగిస్తున్నారా?
- తాత్కాలికంగానే.

184
00:11:09,211 --> 00:11:11,255
బ్లాక్ బర్డ్ లోని కెమెరాలను ఎలా వాడాలో నీకు తెలుసు,

185
00:11:11,338 --> 00:11:13,173
అంటే, ఈ మిషన్ కి నీకన్నా సరైనోడు ఎవరూ లేరు.

186
00:11:13,257 --> 00:11:15,300
నువ్వు ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ కి కో-పైలట్ గా ఉండాలి.

187
00:11:15,384 --> 00:11:17,094
ఒక్క నిమిషం. నాది రియో పాత్రనా? నేను కాదా పైలట్?

188
00:11:17,678 --> 00:11:18,762
ఇప్పటికైతే కాదు.

189
00:11:20,097 --> 00:11:21,890
మేజర్ శాండర్స్. లెఫ్టినెంట్ కెల్లీ.

190
00:11:21,974 --> 00:11:24,685
ఈ మేజర్, బ్లాక్ బర్డ్ లో 23 మిషన్స్ ని పూర్తి చేశాడు.

191
00:11:25,853 --> 00:11:27,563
- మిమ్మల్ని కలవడం బాగుంది.
- హా.

192
00:11:28,230 --> 00:11:30,315
మీరు దీని పైలట్ గా ఉన్నప్పుడు,
మీపై ఎప్పుడైనా దాడి జరిగిందా?

193
00:11:30,399 --> 00:11:32,359
దాడి జరిగి ఉంటే, ఇలా
మళ్ళీ పనికి వచ్చే వాడిని కాదు కదా.

194
00:11:33,151 --> 00:11:37,114
ఇది నేవీ వాళ్ళ పిట్టల వేట కాదు. నిఘా మిషన్ కి
కండ బలం కన్నా, బుద్ధి బలం ఎక్కువ ఉండాలి.

195
00:11:38,198 --> 00:11:40,033
మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందిలే. హా.

196
00:11:42,870 --> 00:11:45,038
మీరు రేడార్ పై కన్నేసి ఉంచండి,
మిగతా సంగతి నేను చూసుకుంటా.

197
00:11:45,122 --> 00:11:47,124
సరే. రేడార్ లో ఏదైనా శత్రు విమానం కనిపిస్తే…

198
00:11:47,207 --> 00:11:49,459
నేను గోచీకి ఎక్కువ, కట్ డ్రాయర్ కి
తక్కువ అయిన మీపై ఆధారపడాలి అన్నమాట.

199
00:11:49,543 --> 00:11:51,879
ఇక్కడ ఉన్నంత సేపు
ఒకరినొకరు చంపుకున్నా పర్లేదు.

200
00:11:51,962 --> 00:11:55,132
కానీ ఆకాశంలోకి వెళ్ళాక, మీరిద్దరూ కలిసి
పని చేయకపోతే, చస్తారు. అది గుర్తుంచుకోండి.

201
00:11:55,215 --> 00:11:57,301
అలాగే, సర్. మీ ఆకారంపై జోక్ చేసినందుకు సారీ.

202
00:11:57,384 --> 00:11:59,720
సాధారణంగా అలాంటి ఆకారాలు పీడకలల్లోనే వస్తుంటాయి మరి.

203
00:12:03,348 --> 00:12:04,892
నాన్నా, ఏంటా దగ్గు!

204
00:12:04,975 --> 00:12:06,685
అబ్బా, నాకేం కాలేదు. బాగానే ఉన్నా.

205
00:12:06,768 --> 00:12:09,104
రాత్రి ఎవరైనా అమ్మాయితో గడుపుతూ ఉన్నావేమో,
అందుకే ఇంటికి రాలేదేమో అనుకున్నా.

206
00:12:09,188 --> 00:12:11,315
అదే జరిగి ఉండవచ్చు. చూద్దాం.

207
00:12:12,232 --> 00:12:13,483
నేను కంగారుపడాల్సిందేమీ లేదు కదా?

208
00:12:13,567 --> 00:12:15,944
లేదు, లేదు. ఇది… ఇది చాలా తేలికైనదే.

209
00:12:16,695 --> 00:12:18,614
తేలికైనదంటే? లిబియాకి వెళ్ళాలా?

210
00:12:18,697 --> 00:12:19,823
ఇరాన్ కి వెళ్ళాలా?

211
00:12:20,365 --> 00:12:22,284
అది… అది నేను చెప్పలేను.

212
00:12:23,952 --> 00:12:26,205
- సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా…
- లేదులే. అలాంటిదేం ఉండదు.

213
00:12:27,039 --> 00:12:28,373
అలాంటిదేమీ జరగదు. నాకు పనుంది.

214
00:12:29,750 --> 00:12:31,460
ఐ… ఐ లవ్ యూ, నాన్నా.

215
00:12:33,754 --> 00:12:34,755
లవ్ యూ టూ, రా.

216
00:12:47,351 --> 00:12:51,480
అమర వీరులు
మన మదిలో చిరంజీవులుగా నిలిచిపోవాలి - మరువకూడదు

217
00:13:17,297 --> 00:13:18,465
సరే మరి.

218
00:13:18,549 --> 00:13:20,008
అది బూట్ లో పెట్టుకోవడం మంచిది.

219
00:13:20,092 --> 00:13:21,093
ఏంటి?

220
00:13:21,176 --> 00:13:22,928
ఎజెక్ట్ అయ్యే పరిస్థితే వస్తే,
చెయిన్ మెడకు చుట్టుకోవచ్చు.

221
00:13:23,846 --> 00:13:24,972
అది వాయుసేనలో ఉండే ఎవరికైనా తెలుసు.

222
00:13:25,681 --> 00:13:27,975
అవునా? ఎవరికైనా తెలుసా?

223
00:13:36,817 --> 00:13:38,360
ట్యాంక్ ప్రెషర్ ఎంత ఉంది?

224
00:13:39,111 --> 00:13:42,906
ప్రెషర్ 1.3 పీఎస్ఐ ఉంది.
ఐజీవీని లాక్ అవుట్ కి సెట్ చేస్తున్నాం.

225
00:13:46,285 --> 00:13:48,954
హాబూ 43, చెక్ లిస్ట్ పూర్తయిందా?

226
00:13:49,037 --> 00:13:51,248
పూర్తయింది. ఐజీవీ సాధారణ స్థాయిలో ఉంది.

227
00:13:51,331 --> 00:13:53,208
ఓబీసీ కెమెరా ఆప్ బాగానే ఉంది.

228
00:13:53,292 --> 00:13:58,755
హాబూ 43, గాలి 265 వైపు, గంటకు అయిదు
కిలోమీటర్ల వేగంతో వీస్తోంది. రన్ వే 26 నుండి టేకాఫ్ చేయండి.

229
00:14:19,776 --> 00:14:22,654
శాండర్స్, ఇంతకీ మీకు పెళ్లయిందా? పిల్లలున్నారా?

230
00:14:23,238 --> 00:14:25,157
కల్నల్ అయ్యే దాకా ఆ ఆలోచన కూడా చేయదలచుకోట్లేదు.

231
00:14:25,866 --> 00:14:29,286
నేను కూడా. మనల్ని అందుకే ఎంపిక చేశారంటారా?

232
00:14:29,870 --> 00:14:31,038
కుటుంబం లేదని?

233
00:14:31,997 --> 00:14:33,498
మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, తెలుసా?

234
00:14:36,793 --> 00:14:39,671
మీ కల నిజమైతే, మీరేమవుతారో మీకు తెలుసు కదా?

235
00:14:41,298 --> 00:14:42,299
ఏమవుతానేంటి?

236
00:14:42,883 --> 00:14:44,301
కల్నల్ శాండర్స్.

237
00:14:47,721 --> 00:14:49,264
మీకు అది ఎవరూ చెప్పలేదా?

238
00:14:51,975 --> 00:14:53,477
వేగం, 1700 నాట్స్.

239
00:14:54,353 --> 00:14:55,854
పదకొండు హెర్బ్స్, స్పైసెస్ కూడా.

240
00:15:16,875 --> 00:15:20,295
ఇక్కడి నుండి చూస్తే, నేలంతా
హద్దుల్లేకుండా ఒకే ముక్కలా కనిపిస్తోంది.

241
00:15:23,632 --> 00:15:25,175
ఫ్లైట్ లెవెల్, ఎనిమిది-సున్నా-సున్నా.

242
00:15:26,009 --> 00:15:27,219
ఓకే.

243
00:15:27,302 --> 00:15:30,180
ముఖ్యమైన విషయం, ఇప్పుడు
మీరు సోవియెట్ గగనతలంలోకి ప్రవేశించారు,

244
00:15:30,264 --> 00:15:32,099
టార్గెట్ కి 825 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.

245
00:15:34,560 --> 00:15:37,521
ఓబీసీ కెమెరాని ఆన్ చేశాం. అది సిద్ధంగా ఉంది.

246
00:15:41,900 --> 00:15:42,901
నేల బాగానే కనిపిస్తోందా?

247
00:15:43,694 --> 00:15:47,614
టార్గెట్ సరిగ్గా కనిపించట్లేదు అసలు.
స్పష్టమైన ఫోటోలు రాకపోవచ్చు.

248
00:15:48,991 --> 00:15:51,785
బేస్, నేను హాబూని. టార్గెట్ సరిగ్గా
కనిపించట్లేదు. ఏం చేయాలో చెప్పండి.

249
00:15:53,745 --> 00:15:56,248
హాబూ, ఫ్లైట్ లెవెల్,
నాలుగు-సున్నా-సున్నాకి దిగండి.

250
00:15:57,666 --> 00:15:58,959
ఇలా ఎత్తు తగ్గించడం ఇదే మొదటిసారి.

251
00:16:00,419 --> 00:16:01,962
సరే. నాలుగు-సున్నా-సున్నాకి దించుతున్నాం.

252
00:16:12,389 --> 00:16:13,557
అదుగో.

253
00:16:14,391 --> 00:16:17,144
ఫిల్మ్ తిరుగుతోంది. టార్గెట్ కనిపిస్తోంది.

254
00:16:21,064 --> 00:16:24,067
శభాష్, జూలూ. మళ్ళీ పైకి వెళ్లి, బేస్ కి వచ్చేయండి.

255
00:16:41,668 --> 00:16:43,462
శత్రు విమానం, ఒకటి-తొమ్మిది-సున్నా-పది దిశలో ఉంది.

256
00:16:44,963 --> 00:16:46,006
అబ్బా.

257
00:16:50,636 --> 00:16:54,765
మిగ్ శత్రు విమానం ఒకటి, వెనుక పక్క కాస్తంత కుడివైపున
ఉంది. జామింగ్ ని ఆన్ చేశా, అది పని చేస్తోంది కూడా.

258
00:17:01,897 --> 00:17:04,066
ఎందుకు పక్కకి తిప్పుతున్నావు?
అలా చేస్తే వేగం తగ్గుతుంది.

259
00:17:04,608 --> 00:17:05,858
నేను చూసుకుంటాలే.

260
00:17:05,943 --> 00:17:07,444
నీ మొహం. వాడు దగ్గరికి వచ్చేస్తాడు.

261
00:17:10,696 --> 00:17:14,409
చూశావా, కెల్లీ? ఇందుకే నిన్ను
కో-పైలట్ చేసింది, నన్ను పైలట్ చేసింది…

262
00:17:17,246 --> 00:17:21,124
శాండర్స్? శాండర్స్, నా మాటలు వినిపిస్తున్నాయా?

263
00:17:26,463 --> 00:17:28,924
హాబూ 43, ఆత్మరక్షణ పరిస్థితి తలెత్తింది.
తూర్పు వైపుకు వెళ్తోంది విమానం.

264
00:17:29,007 --> 00:17:31,343
పెచోరా పట్టణానికి పశ్చిమంగా
150 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.

265
00:17:31,426 --> 00:17:33,887
పైలట్ సమాధానం ఇవ్వట్లేదు, ఫ్లైట్ కంట్రోల్ అవ్వట్లేదు.

266
00:17:39,309 --> 00:17:40,227
కానివ్వు.

267
00:18:01,540 --> 00:18:02,749
కుడి ఇంజిన్ పని చెయ్యట్లేదు.

268
00:18:07,421 --> 00:18:08,547
మే డే, మే డే, మే డే.

269
00:18:08,630 --> 00:18:12,259
హాబూ 43 ఇప్పుడు ల్యాటిట్యూడ్ 65.18 వద్ద,
లాంగిట్యూడ్ 72.10 వద్ద ఉంది.

270
00:18:12,342 --> 00:18:13,677
హెచ్చరిక

271
00:18:13,760 --> 00:18:14,887
నేను ఎజెక్ట్ అవ్వాలి.

272
00:18:14,970 --> 00:18:17,264
అంత వేగంలో ఎజెక్ట్ అయితే చాలా ప్రమాదం, అసాసిన్!

273
00:18:17,347 --> 00:18:18,640
తెలుసు, నాకు తెలుసు.

274
00:18:24,646 --> 00:18:26,398
అంతే. ఇక్కడికి రా.

275
00:19:51,525 --> 00:19:52,526
ఓకే.

276
00:19:59,992 --> 00:20:01,994
టాప్ గన్

277
00:20:15,507 --> 00:20:16,967
లాస్ ఏంజెలెస్ - మానవాభివృద్ధికి సోపానం

278
00:20:17,050 --> 00:20:18,510
న్యూయార్క్ అంటే నాకు ప్రాణం

279
00:20:33,483 --> 00:20:36,403
ఏంటిది? హేయ్!

280
00:20:40,490 --> 00:20:41,575
ఆహ్, మంచిది. నువ్వు చావలేదు.

281
00:20:42,993 --> 00:20:44,411
ఎవరు నువ్వు? నేనెక్కడ ఉన్నాను?

282
00:20:45,954 --> 00:20:48,040
నా పేరు, నికోలాయ్ ఉస్తినోవ్.

283
00:20:48,123 --> 00:20:49,291
కానీ నన్ను నిక్ అని పిలువు.

284
00:20:49,374 --> 00:20:51,460
నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు.

285
00:20:52,252 --> 00:20:54,254
స్వాగతం. ఇది నా భాగ్యంగా భావిస్తున్నా.

286
00:20:54,338 --> 00:20:55,672
నన్నెందుకు మంచానికి కట్టేశావు?

287
00:20:56,965 --> 00:21:00,177
సర్జరీ చేసేటప్పుడు కదలకుండా ఉంటావని కట్టేశా.

288
00:21:01,094 --> 00:21:02,137
సర్జరీ ఏంటి?

289
00:21:02,221 --> 00:21:05,432
నీ కాలిలోకి కొమ్మ గుచ్చుకుంది.
దాన్ని తీసేసి, ఒక ఆర్టరీని బాగు చేశా.

290
00:21:05,516 --> 00:21:07,017
చాలా రక్తం పోయింది.

291
00:21:07,100 --> 00:21:08,852
నీ అరుపులకు టాప్ లేచిపోయింది, కానీ అది నా వల్లేలే,

292
00:21:08,936 --> 00:21:10,979
ఎందుకంటే నా దగ్గర సరైన మత్తుమందు లేదు.

293
00:21:11,813 --> 00:21:13,232
ఇప్పుడు కాస్త… కాస్త నా కట్లు విప్పుతావా?

294
00:21:14,066 --> 00:21:16,818
తప్పకుండా, త్వరలోనే విప్పేస్తా.

295
00:21:17,778 --> 00:21:22,574
కానీ ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం,
అప్పుడే నువ్వు కోలుకోగలవు. హా.

296
00:21:23,200 --> 00:21:27,371
ఓకే. ఎక్కడ… ఎక్కడ చూసినా
అమెరికాకి సంబంధించినవే కనిపిస్తున్నాయేంటి?

297
00:21:27,454 --> 00:21:33,126
ఇది నీకు… నీకు షాకింగ్ గా అనిపించవచ్చు,
నాకు మీ దేశమంటే చాలా ఇష్టం.

298
00:21:33,877 --> 00:21:36,630
మీ ప్రజాస్వామ్యం, సంస్కృతి నాకు నచ్చుతాయి.

299
00:21:36,713 --> 00:21:37,714
ఇంకా, మీ ఆహారం కూడా.

300
00:21:37,798 --> 00:21:40,551
నేను మెక్ డొనల్డ్స్ లో ఎప్పుడూ తినలేదు,
కానీ ఆ ఆహారానికి నేను ఫిదా అయిపోతాను అనుకుంటా.

301
00:21:41,134 --> 00:21:42,845
ఒక రకంగా నాకు పిచ్చి అని చెప్పవచ్చు.

302
00:21:44,346 --> 00:21:45,556
అవునా?

303
00:21:45,639 --> 00:21:48,684
ఏదోక రోజు అమెరికాలో జీవించాలన్నదే నా కల.

304
00:21:49,601 --> 00:21:53,272
మొబైల్ హోమ్ వ్యాన్ లో ఒక చోటి నుండి
మరో చోటికి తిరుగుతూ జీవించాలని.

305
00:21:54,273 --> 00:21:56,567
- బాగుంది
- ఏ పని చేయాలన్నది

306
00:21:59,027 --> 00:22:00,529
ఇంకా అర్థం కావట్లేదు.

307
00:22:00,612 --> 00:22:02,823
కానీ అక్కడ ఏం చేసుకొని అయినా బతికేయవచ్చని తెలుసు.

308
00:22:02,906 --> 00:22:03,907
అవును.

309
00:22:07,286 --> 00:22:09,204
నీకు ఒకటి చూపించాలి.

310
00:22:22,176 --> 00:22:26,221
ఇది చాలా ప్రత్యేకమైనది,
అదే సమయంలో చట్టవిరుద్ధమైనది కూడా.

311
00:22:28,223 --> 00:22:30,642
ఇది ఉంటే, జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

312
00:22:31,602 --> 00:22:33,854
దీన్ని కనీసం వంద సార్లైనా చూసుంటా.

313
00:22:33,937 --> 00:22:36,899
చూసిన ప్రతిసారి, ఈ సినిమాలోని
హీరో స్థానంలో నన్ను నేను ఊహించుకుంటూ ఉంటా.

314
00:22:37,900 --> 00:22:40,152
అతను చేసిన పనులన్నీ
నేనే చేస్తున్నట్టు ఊహించుకుంటా.

315
00:22:42,362 --> 00:22:45,282
విషయం ఏంటంటే, ఇక్కడ
అమెరికన్ సినిమాలు పెద్దగా దొరకవు,

316
00:22:45,365 --> 00:22:48,368
కానీ గతేడాది "టాప్ గన్"కి సంబంధించిన…

317
00:22:49,870 --> 00:22:51,163
ఈ పైరసీ వెర్షన్ ని సంపాదించా.

318
00:22:53,749 --> 00:22:57,294
మీ గురించి నేను అనుకున్నవన్నీ
నిజమేనని ఈ సినిమా చూశాక అర్థమైపోయింది.

319
00:22:58,086 --> 00:23:00,214
హఠాత్తుగా నువ్వు ఇక్కడికి ఊడిపడ్డావు.

320
00:23:00,797 --> 00:23:03,091
నాకోసమే వచ్చిన దైవదూతలా ఆకాశం నుండి వచ్చావు.

321
00:23:03,926 --> 00:23:05,511
- చూడు, నికోలాయ్, నా…
- ఆపేయ్!

322
00:23:08,430 --> 00:23:10,057
నిక్. నన్ను నిక్ అని పిలువు.

323
00:23:10,682 --> 00:23:12,893
నిక్. నా పేరు ట్రాయ్.

324
00:23:12,976 --> 00:23:16,688
- ట్రాయ్, నిన్ను కలవడం బాగుంది.
- నాకు చికిత్స చేసినందుకు థ్యాంక్స్, నిక్.

325
00:23:17,940 --> 00:23:19,608
కానీ నీకు అర్ధమయ్యే ఉంటుంది,
నేను ఇక్కడ ఉండకూడదని.

326
00:23:19,691 --> 00:23:21,693
నేను శత్రునేలపై ఉన్నాను.

327
00:23:22,528 --> 00:23:24,821
అంటే… అంటే, నువ్వు శత్రువు కాదనుకో. ఏమంటావు?

328
00:23:24,905 --> 00:23:27,115
అస్సలు కాదు, ట్రాయ్. నేను నీకు వీరాభిమానిని.

329
00:23:28,200 --> 00:23:29,910
మంచిది. అది మంచిదే.

330
00:23:29,993 --> 00:23:32,246
కాబట్టి, నేను సరిహద్దు దాటి వెళ్ళిపోతేనే
మంచిదని అర్థం చేసుకోగలవుగా.

331
00:23:32,329 --> 00:23:34,373
అవును. మనకు సమీపంలో ఉన్న సరిహద్దు, ఫిన్లాండ్.

332
00:23:34,456 --> 00:23:35,749
ఎంత దూరంలో ఉంది అది?

333
00:23:35,832 --> 00:23:36,959
రెండు వేల కిలోమీటర్లు.

334
00:23:37,042 --> 00:23:38,752
నా దుంపదెగ.

335
00:23:48,387 --> 00:23:49,805
రెండేళ్లయింది.

336
00:23:50,639 --> 00:23:55,477
ఈ పని చెర్మెంకో చనిపోయినప్పుడే
చేసి ఉండవచ్చు కదా నువ్వు?

337
00:23:58,480 --> 00:24:00,858
నా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న వాడి చిత్రపటాన్ని

338
00:24:00,941 --> 00:24:02,985
ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం అనుకోవద్దు.

339
00:24:03,694 --> 00:24:06,697
కానీ గోర్బచెవ్, ఈ దేశాన్ని కాపాడుతున్నానని అంటాడు.

340
00:24:09,491 --> 00:24:12,578
రష్యా ఒకప్పుడు మహాసామ్రాజ్యంగా ఉండేది.

341
00:24:12,661 --> 00:24:15,455
సగం ప్రపంచం మన గుప్పెట్లో ఉండేది.
కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో చూడు.

342
00:24:16,164 --> 00:24:19,585
తాడు, బొంగరం లేని ఒక శక్తివంతమైన దేశం
చేతిలో పరాజయాన్ని మూటకట్టుకుంటూ ఉన్నాం.

343
00:24:19,668 --> 00:24:24,673
ఈ బట్టగాడేమో, శత్రువుతో
చెట్టాపట్టాలేసుకొని తిరగాలంటాడు.

344
00:24:26,508 --> 00:24:27,467
ఏంటది?

345
00:24:27,551 --> 00:24:30,095
కోరోవాయా దగ్గర, అమెరికన్ నిఘా విమానాన్ని కూల్చేశారట.

346
00:24:30,179 --> 00:24:32,431
ఒక పైలట్ ఎజెక్ట్ అయ్యాడని అనుకుంటున్నారు.

347
00:24:33,765 --> 00:24:35,058
విమానం పడిన చోటుకు చేరుకున్నారా?

348
00:24:36,768 --> 00:24:39,229
ఇంకా లేదు. జనరల్ కోర్జెవ్
నాయకత్వంలో ఒక బృందం గాలిస్తోంది.

349
00:24:42,900 --> 00:24:43,901
నేనే నాయకత్వం వహిస్తా.

350
00:24:53,744 --> 00:24:56,246
గూస్! గూస్, నిబ్బరంగా ఉండు!

351
00:25:01,502 --> 00:25:02,336
ఓరి దేవుడా.

352
00:25:02,419 --> 00:25:05,047
గూస్, మావెరిక్ కేవలం కోపైలట్స్ మాత్రమే కాదు.

353
00:25:05,130 --> 00:25:06,548
ప్రాణ మిత్రులు కూడా.

354
00:25:06,632 --> 00:25:07,925
అవును.

355
00:25:10,427 --> 00:25:13,055
ఇప్పుడు సినిమాని వీడియో తీసే వ్యక్తి టాయిలెట్ కి వెళ్తాడు.

356
00:25:13,138 --> 00:25:14,515
ఇప్పుడు సినిమాలో ఏం జరుగుతుందో తెలుసా?

357
00:25:15,140 --> 00:25:17,351
తెలీదు. సారీ.

358
00:25:19,478 --> 00:25:21,230
మరేం పర్వాలేదు. నీకు ఇచ్చిన మాంసం ముక్క ఎలా ఉంది?

359
00:25:21,313 --> 00:25:24,274
ఇది, చాలా గట్టిగా ఉంది.

360
00:25:24,358 --> 00:25:25,692
కనీసం పుల్లగా అయిందా ఉందిలే. కాబట్టి…

361
00:25:26,818 --> 00:25:30,322
హా, చలికాలంలో, తాజా ఎలుగు బంటి
మాంసం తేవడం కష్టం అవుతుంది.

362
00:25:30,405 --> 00:25:31,365
ఇది ఎలుగు బంటి ముక్కనా?

363
00:25:31,448 --> 00:25:33,450
అవును, రూట్ సెల్లార్ లో 40 కిలోల మాంసం ఉంది.

364
00:25:33,534 --> 00:25:34,743
కాబట్టి, కావాల్సినంత తినేయ్.

365
00:25:35,244 --> 00:25:36,828
థ్యాంక్యూ. ఇది ఏంటి?

366
00:25:36,912 --> 00:25:39,164
సమొగోన్. బీట్ రూట్స్ తో తయారు చేస్తా దాన్ని.

367
00:25:39,248 --> 00:25:40,374
బ్యారెల్ లో పెట్టి చేస్తా.

368
00:25:41,208 --> 00:25:42,376
కానీ, బీట్ రూట్స్ రుచి తెలీట్లేదు.

369
00:25:42,459 --> 00:25:44,127
చాలా చాలా థ్యాంక్స్.

370
00:25:45,879 --> 00:25:51,802
నీ ఫ్లైట్ సూట్ మీద, నీ నిక్ నేమ్, అసాసిన్ అని ఉంది.

371
00:25:53,303 --> 00:25:55,097
ఆ పేరు నీకెలా వచ్చిందో తెలుసుకోవచ్చా?

372
00:25:56,014 --> 00:25:58,016
అది నాకు, నా మిత్రులకి మాత్రమే తెలుసు.

373
00:25:59,726 --> 00:26:00,894
అలాగా.

374
00:26:03,480 --> 00:26:08,986
ఏదోకరోజు, మనిద్దరం కూడా
అంత మంచి మిత్రులం కావాలనే ఆశిస్తున్నా.

375
00:26:10,487 --> 00:26:14,199
తప్పకుండా. కానీ నేను ఇక బయలుదేరాలి.

376
00:26:14,283 --> 00:26:16,827
కాస్త నా కట్లు విప్పేస్తే, నా దారిన నేను పోతా.

377
00:26:16,910 --> 00:26:18,745
కట్లు విప్పేస్తే, నువ్వు వెళ్ళిపోతావు.

378
00:26:18,829 --> 00:26:21,039
అవును. నేను అన్నది కూడా అదే.

379
00:26:21,540 --> 00:26:23,834
నీ పరిస్థితి నీకు అర్థమైనట్టుగా లేదు.

380
00:26:24,585 --> 00:26:27,296
నువ్వు సురక్షితమైన చోటుకు వెళ్లాలంటే
వేలాది కిలోమీటర్లు దాటుకొని వెళ్ళాలి.

381
00:26:27,379 --> 00:26:29,840
సోవియెట్ సైన్యం నీ కోసం గాలిస్తూ ఉంటుంది.

382
00:26:30,340 --> 00:26:33,468
వాళ్ళ చేతికి నువ్వు చిక్కాక,
వాళ్లు నిన్ను కేజీబీకి అప్పగించేస్తారు.

383
00:26:34,303 --> 00:26:37,097
అదే జరిగితే, నీ బతుకు
కుక్కలు చింపిన విస్తరి అయిపోతుంది.

384
00:26:37,181 --> 00:26:40,225
చెప్తున్నా కదా, నా దగ్గర ఉంటేనే నీకు క్షేమం.

385
00:26:40,726 --> 00:26:42,436
నేనిక్కడ ఉండలేను.

386
00:26:42,519 --> 00:26:44,229
కోల్డ్ వార్ అయిపోయే దాకా ఉంటే సరిపోతుంది.

387
00:26:44,313 --> 00:26:46,648
కోల్డ్ వార్ 40 ఏళ్ల నుండి జరుగుతూనే ఉంది.

388
00:26:46,732 --> 00:26:48,567
అవును. ఇంకెంత కాలం జరుగుతుంది అనుకుంటున్నావు?

389
00:26:50,694 --> 00:26:55,199
సరే. సరే. నువ్వన్నదే నిజమే ఏమో.

390
00:26:55,282 --> 00:26:58,243
చూడు, నేను… నేనున్న పరిస్థితిలో
ఇక్కడ ఉండటం అంత పనికిమాలిన పని ఇంకోటి ఉండదు.

391
00:26:58,327 --> 00:26:59,828
నిన్ను పంపించేయడం అంత పనికిమాలిన పని కాదులే.

392
00:26:59,912 --> 00:27:01,121
సరే. అలాగే.

393
00:27:01,205 --> 00:27:03,749
నేను… నేను వెళ్లడం సురక్షితమే
అనిపించే దాకా ఇక్కడే ఉంటా.

394
00:27:04,333 --> 00:27:05,542
- సూపర్.
- సరే.

395
00:27:06,210 --> 00:27:08,504
అప్పటి దాకా… అప్పటి దాకా నన్నిలా కట్టేసే ఉంచుతావా?

396
00:27:08,587 --> 00:27:12,758
లేదులే. ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగే దాకే.

397
00:27:12,841 --> 00:27:16,512
నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నిక్, థ్యాంక్యూ.

398
00:27:17,012 --> 00:27:18,305
- హా, పర్వాలేదులే.
- హా.

399
00:27:18,388 --> 00:27:19,932
మనిద్దరం చాలా సరదాగా గడపవచ్చు.

400
00:27:20,474 --> 00:27:21,308
ఇప్పుడు బాగుంది.

401
00:27:23,936 --> 00:27:24,978
చాలా బాగుంది. ఓకే.

402
00:27:28,649 --> 00:27:29,816
క్షమించు, నిక్.

403
00:27:31,944 --> 00:27:33,028
దయచేసి ఇక్కడే ఉండు.

404
00:27:49,086 --> 00:27:50,712
ఇంత ఒడుపుగా ఎలా ఫైట్ చేస్తున్నావు?

405
00:27:53,549 --> 00:27:55,676
నా తలను భలే పట్టుకున్నావులే.

406
00:28:01,723 --> 00:28:03,976
అనవసరంగా దెబ్బలు తింటున్నావు. ఇక ఆపేద్దాం.

407
00:28:04,059 --> 00:28:05,310
సరే. నువ్వే గెలిచావు.

408
00:28:08,856 --> 00:28:09,898
సూపర్.

409
00:28:24,413 --> 00:28:25,789
తాళం చెవులు ఎక్కడ! ఎక్కడ అవి!

410
00:28:36,258 --> 00:28:38,510
హేయ్! లోపలికి వచ్చేయ్, గురూ.

411
00:28:38,594 --> 00:28:39,595
టీ చేస్తాను.

412
00:30:53,937 --> 00:30:56,690
దయచేసి మాస్కోలో ఉండే
యుఎస్ ఎంబసీకి లైన్ కలపరా? త్వరగా.

413
00:30:56,773 --> 00:30:57,608
త్వరగా…

414
00:31:01,653 --> 00:31:05,240
ఇది మీకు. ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నానంతే.

415
00:31:06,116 --> 00:31:08,035
సరే. వద్దు, వద్దు. హేయ్, హేయ్. ఆగండి, ఆగండి.

416
00:31:09,453 --> 00:31:10,537
వెళ్లిపోతున్నా. సరేనా? నేను…

417
00:31:11,205 --> 00:31:13,165
సరే. ఇలా చూడండి. మరేం పర్వాలేదు. మరేం…

418
00:31:21,882 --> 00:31:22,966
వద్దు…

419
00:32:52,514 --> 00:32:53,515
ఏం పర్వాలేదు.

420
00:32:53,599 --> 00:32:54,433
నికోలాయ్.

421
00:32:55,184 --> 00:32:56,894
ఏంటి ఇదంతా?

422
00:32:59,313 --> 00:33:00,647
వాళ్ళు తాగిన దానికి డబ్బులు ఇవిగో.

423
00:33:06,737 --> 00:33:10,657
ఎవరు నువ్వు?
అంత కత్తిలా ఎలా కొట్టగలుగుతున్నావు?

424
00:33:10,741 --> 00:33:13,785
గాయం అవ్వకుండా ఉంటే,
నువ్వు కూడా బాగానే ఫైట్ చేసి ఉండేవాడివి.

425
00:33:13,869 --> 00:33:16,622
మా ఫైటింగ్ ట్రెయినింగ్ కంటే
మీ అమెరికన్ల ట్రెయినింగ్ బాగుంటుంది.

426
00:33:17,331 --> 00:33:19,499
"మా ట్రెయినింగ్"? నువ్వు సైన్యంలో పని చేశావా?

427
00:33:20,125 --> 00:33:21,293
ఎక్కడ పని చేస్తే ఏంటి?

428
00:33:22,336 --> 00:33:24,963
నాకు అది ముఖ్యం.
నేను నీతో ఉంటున్నా కాబట్టి, నాకు తెలియాలి.

429
00:33:29,801 --> 00:33:31,762
చాలా ఏళ్ల క్రితం, నేను
స్టేట్ సెక్యూరిటీ ఆఫీసరుగా పని చేశా.

430
00:33:32,596 --> 00:33:36,058
ఒక్క నిమిషం. నువ్వు కేజీబీలో చేశావా?
వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు?

431
00:33:36,850 --> 00:33:38,143
ఇప్పుడేం చేయట్లేదు.

432
00:33:38,727 --> 00:33:42,105
ఒకప్పుడు… అండర్ కవర్ ఆపరేషన్స్
జరిపే బృందానికి నాయకుడిగా పని చేశా.

433
00:33:42,648 --> 00:33:45,651
నిఘా కార్యకలాపాలు. విచారణ చేయడం.

434
00:33:45,734 --> 00:33:47,027
నువ్వు రాక్షసుడివి అన్నమాట.

435
00:33:47,110 --> 00:33:49,571
నా దేశ ప్రయోజనాల కోసం
పని చేస్తూ ఉన్నానని అనుకున్నా.

436
00:33:51,073 --> 00:33:51,907
అంతేలే.

437
00:33:51,990 --> 00:33:55,369
కానీ నా కూతురు పెరిగి పెద్దదయి,
ఆఫీసులో నేను చేసే పనేంటి అని అడిగినప్పుడు,

438
00:33:55,452 --> 00:33:58,664
తనకి చెప్పడానికి నాకు మాట రాలేదు.

439
00:33:59,748 --> 00:34:01,959
ఒక మనిషి ఎక్కువ కాలం ఓ పని చేస్తూ ఉన్నప్పుడు,

440
00:34:02,042 --> 00:34:03,377
అది పనిగానే ఉండిపోతుంది అనుకోవద్దు.

441
00:34:04,878 --> 00:34:06,296
అతని గుణం అయిపోతుంది అది.

442
00:34:09,882 --> 00:34:13,303
అంటే, నువ్వు చేసిన పాపాలకు దూరంగా,
ఇక్కడికి వచ్చి అడవి మనిషిలా ఉంటున్నావని

443
00:34:13,387 --> 00:34:15,848
నన్ను నమ్మమంటున్నావా? అంతేనా?

444
00:34:16,556 --> 00:34:20,476
ప్రభుత్వం నుండి వీలైనంత
దూరంగా ఉందామని ఇక్కడికి వచ్చా.

445
00:34:20,561 --> 00:34:23,272
నేను కూడా నీకు వీలైనంత దూరంగా ఉండాలి.

446
00:34:23,355 --> 00:34:26,608
కాస్త చెప్పేది విను. ఇంకా నేను
ఆ రాక్షసుడినే అయి ఉంటే, నీకు ఆశ్రయం ఇస్తానా?

447
00:34:27,484 --> 00:34:29,777
ఎందుకు నీకు చికిత్స చేస్తాను?
బారులో వాళ్ళతో ఎందుకు ఫైట్ చేస్తాను?

448
00:34:30,445 --> 00:34:32,822
దేశానికి శత్రువైన వాడికి సహకరించాను.

449
00:34:33,949 --> 00:34:35,617
దానికి మరణ శిక్ష వేస్తారు.

450
00:34:40,246 --> 00:34:42,165
నాకు సాయపడినందుకు థ్యాంక్స్.

451
00:34:43,792 --> 00:34:46,420
- నీకు మంట అంటించినందుకు సారీ.
- నువ్వు ఇంటికి వెళ్లిపోవాలని అలా చేశావులే.

452
00:34:46,503 --> 00:34:47,588
ఆ ప్రయత్నం వల్ల ఏ లాభమూ జరగలేదు.

453
00:34:47,670 --> 00:34:49,840
కనీసం ఎంబసీ వాళ్లతో కూడా ఫోనులో మాట్లాడలేకపోయాను.

454
00:34:51,425 --> 00:34:55,094
ఒకవేళ మాట్లాడి ఉంటే, మన ఇంటికి
స్టేట్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఉండేవారు.

455
00:34:55,929 --> 00:34:58,182
విదేశీ ఎంబసీలకు చేసే కాల్స్ అన్నింటినీ
ప్రభుత్వం చాటుగా వింటుంది.

456
00:35:00,058 --> 00:35:02,019
- దీని ద్వారా కాల్ చేయవచ్చా?
- అది ఎప్పటిదో.

457
00:35:02,102 --> 00:35:04,563
సిగ్నల్స్ అన్నీ బాగున్నా,
దాని పరిధి 30 కిలోమీటర్లే ఉంటుంది.

458
00:35:05,189 --> 00:35:08,233
నువ్వు కాల్ చేయాలంటే, ఆల్తాయి కావాలి, అదొక్కటే దారి.

459
00:35:09,526 --> 00:35:12,237
- ఏంటి?
- అది మొబైల్ రేడియో టెలిఫోన్.

460
00:35:12,321 --> 00:35:14,031
ఆ కాల్స్ ని ట్రేస్ చేయలేరు.
ఆ కాల్ సంబాషణలను వినరు కూడా.

461
00:35:14,114 --> 00:35:15,782
సరే. వాటిని సంపాదించడం ఎలా?

462
00:35:15,866 --> 00:35:18,785
అది కుదరదు. అవి ఉన్నత ప్రభుత్వ అధికారులకే ఇస్తారు.

463
00:35:18,869 --> 00:35:20,996
ఇక్కడ అవి ఎక్కువ ఉండవనుకుంటా కదా?

464
00:35:21,079 --> 00:35:21,914
హా. ఇక్కడ ఉండవు.

465
00:35:21,997 --> 00:35:24,750
- లేక్… లేక్ వోజెలో దొరుకుతాయి.
- లేక్ వోజె?

466
00:35:24,833 --> 00:35:28,253
చాలా మంది ఉన్నత ప్రభుత్వాధికారులకు
అక్కడ బంగళాలు ఉన్నాయి.

467
00:35:28,337 --> 00:35:29,755
అది దగ్గరేనా?

468
00:35:29,838 --> 00:35:33,592
సుమారుగా, ఇక్కడికి, మాస్కోకి సగం దూరంలో ఉంటుంది.

469
00:35:34,468 --> 00:35:37,012
సూపర్! మనం ఆల్తాయిని దొంగిలిద్దాం,

470
00:35:37,095 --> 00:35:39,806
దానితో నేను ఎంబసీకి కాల్ చేస్తా,
వాళ్ళు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు.

471
00:35:41,391 --> 00:35:42,434
ఏమైంది?

472
00:35:42,518 --> 00:35:44,728
నిన్ను కాపాడతారు, కానీ నా పరిస్థితి…

473
00:35:46,021 --> 00:35:47,022
అర్థమైంది.

474
00:35:48,357 --> 00:35:49,900
నిన్ను కూడా నాతో అమెరికాకు తీసుకెళ్ళనా?

475
00:35:50,734 --> 00:35:52,486
సోవియెట్ వాళ్ళని అలా రానివ్వరు, ట్రాయ్.

476
00:35:52,569 --> 00:35:54,863
సాధారణంగా అయితే రానివ్వరు.
కానీ నేను విమానం కూలి, ఇక్కడ పడిన పైలట్ ని.

477
00:35:54,947 --> 00:35:57,616
నన్ను అక్కడ హీరోలా చూస్తారు.
మెడల్ ఆఫ్ హానర్ కూడా ఇవ్వవచ్చు నాకు.

478
00:35:57,699 --> 00:35:59,493
కాబట్టి నా మాటను ఎంబసీ వాళ్ళు
కాదనే అవకాశమే లేదు, నిక్.

479
00:35:59,576 --> 00:36:00,869
దురదృష్టవశాత్తూ, అదంత తేలిక కాదు.

480
00:36:00,953 --> 00:36:03,247
మాస్కోలో నా కూతురు ఉంటోంది.
తను లేకుండా నేను రాలేను.

481
00:36:03,330 --> 00:36:04,206
తనని కూడా తీసుకెళ్లిపోదాం.

482
00:36:04,289 --> 00:36:09,545
తను రాదు. నేను మారానని తను నమ్మట్లేదు.

483
00:36:09,628 --> 00:36:11,338
తనతో మాట్లాడి చూడు. నువ్వు మారావని నమ్మించు.

484
00:36:11,922 --> 00:36:18,595
మీలా రష్యన్లు తమ మనస్సులో
మాటని బాహాటంగా చెప్పేయలేరు.

485
00:36:19,179 --> 00:36:22,266
నీ కల అమెరికన్ అవ్వడమని చెప్పావు కదా.

486
00:36:22,349 --> 00:36:24,810
అమెరికన్ లా ప్రవర్తించడం మొదలుపెట్టు మరి.

487
00:36:25,978 --> 00:36:27,271
నిక్, నాకు సాయపడతావా?

488
00:36:30,566 --> 00:36:35,237
నీ మాటలు చాలా ఆశ కలిగిస్తున్నాయి,
కానీ ఆ పని చాలా ప్రమాదకరమైనది కూడా.

489
00:36:35,320 --> 00:36:38,448
హేయ్. "పులి నోట్లో తల పెట్టే" సమయం

490
00:36:39,783 --> 00:36:41,535
వచ్చేసింది కదా?

491
00:36:43,871 --> 00:36:44,955
కెన్నీ లాగిన్స్ పాట కదా అది.

492
00:36:46,540 --> 00:36:47,583
నాకు ఈ జోక్ అర్థమైంది.

493
00:36:47,666 --> 00:36:48,876
నేను చెప్పింది ఓకేనా?

494
00:36:51,128 --> 00:36:53,714
ముందు నా డ్రింక్ తాగి, ఆ తర్వాత నిర్ణయిస్తా.

495
00:36:53,797 --> 00:36:54,631
తప్పకుండా. హా.

496
00:36:55,591 --> 00:36:56,675
నాకు ఓకే.

497
00:37:25,704 --> 00:37:26,747
త్వరగా లాగించేయవయ్యా.

498
00:37:35,047 --> 00:37:36,215
భలేవాడివే!

499
00:37:36,298 --> 00:37:37,883
ఈ భూమ్మీద అంత కన్నా చిన్న గ్లాసు ఉండదు!

500
00:38:05,118 --> 00:38:07,037
ఏం కావాలి, కామ్రేడ్?

501
00:38:07,120 --> 00:38:09,581
నా పేరు అలెగ్జాండర్ వోల్కోవ్.
స్టేట్ సెక్యూరిటీ మనిషిని. లోపలికి రావచ్చా?

502
00:38:17,631 --> 00:38:19,591
ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు, కదా?

503
00:38:20,843 --> 00:38:21,760
అవును.

504
00:38:21,844 --> 00:38:23,095
దేని కోసం వచ్చారు?

505
00:38:23,887 --> 00:38:25,931
ఇక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో
ఒక యుద్ధ విమానం కూలింది.

506
00:38:26,014 --> 00:38:29,977
మాకు పనికొచ్చేది ఎవరికైనా కనిపించిందా,
ఎవరికైనా వినిపించిందా అని ఇక్కడి వారిని అడుగుతున్నాం.

507
00:38:32,062 --> 00:38:33,605
లేదు, సర్.

508
00:38:34,648 --> 00:38:35,649
సరే.

509
00:38:42,281 --> 00:38:44,032
తను నా కూతురు, ఆనా.

510
00:38:45,367 --> 00:38:46,869
ఒకప్పుడు మీరు కేజీబీలో పని చేశారా?

511
00:38:47,995 --> 00:38:48,871
మీకెలా…

512
00:38:48,954 --> 00:38:50,706
మీ ఉంగరాన్ని చూసి అడుగుతన్నా.

513
00:38:51,748 --> 00:38:53,458
ఏ డివిజన్?

514
00:38:54,459 --> 00:38:55,752
ఆల్ఫా గ్రూప్.

515
00:39:01,049 --> 00:39:02,259
మీ సేవకు ధన్యవాదాలు తెలుపుతున్నా.

516
00:39:02,342 --> 00:39:03,886
ఎందుకు బయటకు వచ్చేశారు?

517
00:39:05,053 --> 00:39:07,014
నాలోని చురుకుతనం కాస్తంత తగ్గుతూ ఉండింది.

518
00:39:09,933 --> 00:39:12,144
మీరు భలే చురుకైన వ్యక్తిలా అనిపిస్తున్నారే.

519
00:39:25,741 --> 00:39:27,326
ఈ కింద ఏముంది?

520
00:39:28,202 --> 00:39:29,369
రూట్ సెల్లార్.

521
00:39:29,995 --> 00:39:31,496
చూపించండి మరి.

522
00:39:32,915 --> 00:39:35,375
అక్కడేం లేదు.

523
00:39:41,298 --> 00:39:42,633
మీ ఇష్టం.

524
00:39:54,102 --> 00:39:55,562
దొరికిపోయారు మీరు!

525
00:40:00,150 --> 00:40:01,109
సమొగోన్?

526
00:40:01,193 --> 00:40:02,277
అవును…

527
00:40:02,361 --> 00:40:05,697
ఇంట్లో మద్యం తయారు చేయడం నేరమని మీకు తెలీదా?

528
00:40:06,198 --> 00:40:08,492
క్షమించాలి, కామ్రేడ్ వోల్కోవ్. నాకది తెలీదు…

529
00:40:08,575 --> 00:40:09,618
ఇక చాల్లే.

530
00:40:10,410 --> 00:40:11,912
ఒక డీల్ కుదుర్చుకుందాం.

531
00:40:11,995 --> 00:40:13,622
మీరు నాకొక గ్లాస్ పోసి ఇవ్వండి,

532
00:40:13,705 --> 00:40:15,332
ఈ విషయం నేనెవరికీ చెప్పను.

533
00:40:17,000 --> 00:40:19,044
తప్పకుండా.

534
00:40:40,148 --> 00:40:41,275
బీట్ రూట్స్ రుచి తెలుస్తోంది.

535
00:40:41,358 --> 00:40:42,943
చాలా చాలా థ్యాంక్స్.

536
00:40:44,570 --> 00:40:48,574
1968లో ప్రాగ్ లో మేము తాగిన మూన్ షైన్ గుర్తుకొస్తోంది.

537
00:40:49,074 --> 00:40:51,201
అప్పుడు నేను దిగువ స్థాయి జూనియర్ లెఫ్టినెంట్ ని.

538
00:40:51,869 --> 00:40:55,789
చాలీచాలని ఆహారంతో సైనిక డార్మిటరీల్లో
రెండు నెలలు గడిపాం మేము.

539
00:40:55,873 --> 00:40:57,082
కాబట్టి ఎక్కువ తాగేవాళ్ళం.

540
00:40:59,001 --> 00:41:01,295
మీరు దాన్ని మిస్ అవుతూ ఉంటారు.

541
00:41:02,337 --> 00:41:03,589
సైనికుల మధ్య ఉండే సహోదర భావం.

542
00:41:04,173 --> 00:41:07,384
మన మాతృభూమి కోసం మనం చేసే త్యాగాలు.

543
00:41:09,428 --> 00:41:11,972
వాటి గురించి నేను తలచుకోని రోజంటూ లేదు.

544
00:41:15,392 --> 00:41:16,476
సరే మరి,

545
00:41:17,227 --> 00:41:18,812
మీ ఆతిథ్యానికి థ్యాంక్స్.

546
00:41:20,522 --> 00:41:22,065
ఇక నేను నా సర్వేని కొనసాగించాలి.

547
00:41:22,149 --> 00:41:23,650
తప్పకుండా.

548
00:41:24,234 --> 00:41:28,864
మళ్ళీ మీతో మాట్లాడే అవసరం ఏర్పడితే,
ఇక్కడికే రావచ్చు కదా?

549
00:41:30,532 --> 00:41:32,367
మీకేదైనా గుర్తొస్తే,

550
00:41:32,451 --> 00:41:33,994
నిస్సంకోచంగా కాల్ చేయండి.

551
00:41:35,495 --> 00:41:37,414
మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.

552
00:41:38,165 --> 00:41:39,458
మీరు, మీ కూతురు కూడా.

553
00:41:49,343 --> 00:41:50,344
దేవుడా.

554
00:41:51,970 --> 00:41:53,722
అతడిని డిన్నర్ కి కూడా ఉండమంటావేమో అని అనుకున్నా.

555
00:41:53,805 --> 00:41:55,641
- ఇది మంచిది కాదు.
- ఏమంటున్నావు? అతను వెళ్లిపోయాడుగా.

556
00:41:55,724 --> 00:41:57,976
అతను బారులో మనం ఫైట్ చేసిన వారితో
మాట్లాడతాడు. వాళ్ళు మన గురించి చెప్తారు.

557
00:41:58,060 --> 00:41:59,561
మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి.

558
00:41:59,645 --> 00:42:02,147
ఒకటి చెప్పనా? ఆ సమొగోన్ వల్ల మంట పుడుతోంది.

559
00:42:02,231 --> 00:42:03,565
శరీరమంతా, నిక్.

560
00:42:12,783 --> 00:42:14,493
ఆ పని చేస్తూ డ్రైవ్ చేయడం క్షేమం కాదేమో.

561
00:42:15,035 --> 00:42:16,745
ఇప్పడు దాని గురించి ఆలోచించేంత సమయం లేదు.

562
00:42:16,828 --> 00:42:19,248
నీ గెడ్డం అంతా నా నోట్లో వచ్చి పడుతోంది.

563
00:42:20,541 --> 00:42:23,627
సరే. కాస్త… కాస్త నీ చేతులని స్టీరింగ్ పై పెడతావా?

564
00:42:23,710 --> 00:42:24,711
కనీసం నెమ్మదిగానైనా నడుపుతావా?

565
00:42:24,795 --> 00:42:26,964
వాళ్ళకి మన గురించి తెలిసిపోయిందో లేదో తెలీదు.

566
00:42:27,047 --> 00:42:28,423
మనం మన రూపురేఖలను మార్చాలి.

567
00:42:28,507 --> 00:42:30,968
కారు ఏదైనా చెట్టుకు గుద్దుకుంటే,
మన రూపురేఖలు ఖచ్చితంగా మారిపోతాయి.

568
00:42:40,018 --> 00:42:42,020
లేక్ వోజెకి వెళ్ళడానికి ఎంత సేపు పడుతుంది?

569
00:42:42,104 --> 00:42:43,188
మూడు రోజులు.

570
00:42:43,272 --> 00:42:45,399
కానీ ఒక్కరోజులోనే అక్కడికి చేరుకుంటాం.

571
00:42:46,191 --> 00:42:47,192
ఎలా?

572
00:42:49,736 --> 00:42:51,613
- మనం కార్లో వెళ్లట్లేదు.
- ఏం చేస్తున్నావు?

573
00:42:52,155 --> 00:42:53,448
నా ట్రక్ కోసం వెతుకుతుంటారు.

574
00:42:54,032 --> 00:42:55,033
అయితే?

575
00:42:55,826 --> 00:42:56,952
నువ్వు బయటకు దిగితే మంచిది.

576
00:42:57,035 --> 00:42:58,871
ఏంటి? ఎందుకు?

577
00:43:01,331 --> 00:43:02,332
ఓయబ్బో.

578
00:43:06,378 --> 00:43:07,588
ఇది సరస్సా?

579
00:43:08,422 --> 00:43:10,424
ఈ పని చేస్తున్నావని నాకు ముందే చెప్పి ఉండవచ్చు కదా.

580
00:43:10,507 --> 00:43:13,468
క్షమించు. జాడ దొరక్కుండా చేయడానికి
ఫాలో అయ్యే స్టాండర్ట్ పద్ధతి నీకు తెలుసు అనుకున్నా.

581
00:43:13,552 --> 00:43:15,679
ఇలాంటి పద్ధతుల గురించి పైలట్లకు శిక్షణ ఇవ్వరా?

582
00:43:15,762 --> 00:43:19,224
లేదు, నిక్. యుద్ధ విమానాలను ఇలా గడ్డకట్టుకుపోయి
ఉండే సరస్సుల్లో దాచే పద్ధతులని మాకు నేర్పలేదు.

583
00:43:20,392 --> 00:43:21,351
ఎక్కడికి వెళ్తున్నాం?

584
00:43:21,977 --> 00:43:24,271
రైల్వే స్టేషన్ కి. ఈ దారిలో.

585
00:43:25,898 --> 00:43:28,400
ఇంకా నీ గెడ్డం నా నోట్లోకి వచ్చి పడుతోంది.

586
00:43:34,114 --> 00:43:39,870
మా బలగాలు, అడవిలోని
ఉత్తర అంచుల్లో, తూర్పు అంచుల్లో గాలిస్తున్నాయి.

587
00:43:40,913 --> 00:43:44,166
రెండో పైలట్ ఇక్కడ ల్యాండ్ అయ్యాడు.

588
00:43:46,793 --> 00:43:48,128
శవం దొరకలేదా?

589
00:43:48,212 --> 00:43:49,546
అతను చనిపోలేదు.

590
00:43:49,630 --> 00:43:51,507
అతని అడుగులని మంచు కప్పేసింది.

591
00:44:02,267 --> 00:44:03,268
అతని బూట్.

592
00:44:03,352 --> 00:44:05,729
దాన్ని దించడానికి కావాల్సిన
సామాగ్రి కోసం ఎదురు చూస్తున్నాం.

593
00:44:05,812 --> 00:44:06,980
దీన్ని పట్టుకో.

594
00:44:43,183 --> 00:44:44,810
వీడి ఫోటోను సంపాదించండి.

595
00:44:46,186 --> 00:44:47,896
సెక్యూరిటీ వాళ్లందరికీ దాన్ని పంపించండి.

596
00:45:06,123 --> 00:45:08,709
ఆ కూల్చేదేదో మమ్మల్ని
సరిహద్దుకు దగ్గరగానే కూల్చవచ్చు కదా?

597
00:45:10,252 --> 00:45:11,336
"మమ్మల్ని" అంటున్నావే?

598
00:45:12,045 --> 00:45:13,755
హా, నాతో పాటు శాండర్స్ అనే
పైలట్ కూడా ఉన్నాడు. అతను…

599
00:45:13,839 --> 00:45:15,090
అతను చనిపోయాడు.

600
00:45:15,591 --> 00:45:16,592
అయ్యయ్యో.

601
00:45:17,593 --> 00:45:20,262
అతను దరిద్రుడే, కానీ అలా చనిపోయి ఉండాల్సింది కాదు.

602
00:45:20,345 --> 00:45:23,724
ఫైటర్ పైలట్ కావాలంటే చాలా ధైర్యం కావాలి.

603
00:45:25,976 --> 00:45:27,227
అంతే అనుకుంటా.

604
00:45:28,353 --> 00:45:29,855
మొదట్నుంచీ నాకు ఫైటర్ పైలట్ కావాలనే ఉండేది.

605
00:45:31,398 --> 00:45:35,819
నిజానికి, మొదట నాకు మా నాన్నలా
నేవీకి నౌకలను నిర్మించాలని ఉండింది.

606
00:45:37,404 --> 00:45:41,909
నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు, మా నాన్న
యుఎస్ఎస్ ర్యాండాల్ఫ్ నౌకలోకి నన్ను తీసుకెళ్లాడు,

607
00:45:41,992 --> 00:45:44,494
నౌకపై ఎఫ్-9ల ల్యాండింగ్ టెస్ట్ ని చూపడానికి…

608
00:45:46,788 --> 00:45:49,541
ఆ పైలట్లు యుద్ధ విమానాల డెక్ పై,
చేతుల్లో హెల్మెట్లు పెట్టుకొని

609
00:45:49,625 --> 00:45:53,629
అలా స్టయిల్ గా నడిచి వస్తుంటే,
మా నాన్నతో పాటు అందరికీ

610
00:45:55,297 --> 00:45:57,299
వాళ్ళు దేవుళ్ళలా కనిపించారు, ఇక…

611
00:45:57,799 --> 00:46:00,469
ఇక అంతే. అది… అది నా మైండ్ లో ముద్రపడిపోయింది.

612
00:46:02,596 --> 00:46:04,306
అయితే, నువ్వు దేవుడివి కావాలనుకున్నావన్నమాట.

613
00:46:07,559 --> 00:46:10,354
నేను నా దేశానికి సేవ చేయాలనుకున్నా.
అది నువ్వు అర్థం చేసుకోగలవనే అనుకుంటున్నా.

614
00:46:10,437 --> 00:46:12,397
నేను భయం వల్ల సర్వీసులో చేరా.

615
00:46:12,481 --> 00:46:14,858
అమెరికా మమ్మల్ని నాశనం చేసేస్తుందని మాకు చెప్పారు.

616
00:46:15,442 --> 00:46:18,654
మీ దురాశ, మూర్ఖత్వం వల్ల
మానవజాతి అంతమైపోతుందని చెప్పారు.

617
00:46:18,737 --> 00:46:21,406
మాకేమో మీరు ప్రపంచ వినాశనానికి
నడుం కట్టారని చెప్పారు.

618
00:46:21,490 --> 00:46:23,367
మనకి అబద్ధాలు చెప్పారు.

619
00:46:23,450 --> 00:46:24,618
నాకేం అబద్ధాలు చెప్పలేదు.

620
00:46:24,701 --> 00:46:27,120
క్రుస్కేవ్ అన్నాడు కదా, "మిమ్మల్ని పాతేస్తాం," అని.

621
00:46:27,204 --> 00:46:30,374
రీగన్ మమ్మల్ని దుష్ట సామ్రాజ్యం అని అన్నారు.
మేమందరమూ దుష్టులమే అంటావా?

622
00:46:30,457 --> 00:46:31,625
మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసినట్టున్నారు.

623
00:46:31,708 --> 00:46:33,418
మీ సిస్టమ్ లో అది మాములే కదా?

624
00:46:33,502 --> 00:46:36,713
మీ సిస్టమ్ లో అది జరగదంటావా, ట్రాయ్?

625
00:46:41,593 --> 00:46:43,220
నీ కేజీబీ ఏజెంట్ ఎత్తులు నాపై ప్రయోగించకు.

626
00:46:46,473 --> 00:46:48,183
నేను కాసేపు పడుకుంటా.

627
00:46:49,351 --> 00:46:52,229
"స్టారొకోస్త్యాంతినివిస్కీ"కి చేరుకున్నాక లేపు నన్ను.

628
00:46:53,146 --> 00:46:55,482
లేపకుండా ఎలా ఉంటా!

629
00:47:40,819 --> 00:47:43,405
నిక్. లే.

630
00:47:48,952 --> 00:47:50,954
మనం వేరే కంపార్టుమెంటులోకి వెళ్తే మంచిదనిపిస్తోంది.

631
00:47:59,505 --> 00:48:00,672
ఇప్పుడు నాకు వీళ్ళ వ్యాధులు వస్తాయి.

632
00:48:18,649 --> 00:48:20,609
నిక్, లేవరా నీకు దండం పెడతా.

633
00:48:26,073 --> 00:48:27,407
ఆ ఫైలులోకి చూడవద్దురా.

634
00:48:31,078 --> 00:48:32,955
హా, స్నేహితులకి కూడా చూపిస్తున్నాడుగా.

635
00:48:56,979 --> 00:48:57,980
పందిలా పడుకున్నావా?

636
00:48:58,063 --> 00:49:00,440
కామ్రేడ్స్, నేను కేజీబీ ఆఫీసరుని.

637
00:49:01,024 --> 00:49:04,319
ఈ ఖైదీని తీసుకెళ్లి నా పైవారికి అప్పగిస్తున్నాను.

638
00:49:05,863 --> 00:49:06,864
నీ మాటలను మేమెందుకు నమ్మాలి?

639
00:49:06,947 --> 00:49:08,866
నా తోటి సైనిక సోదరులతో ఎలా అబద్ధాలు ఆడతాను?

640
00:49:08,949 --> 00:49:10,868
ఇప్పుడు చెప్పేది విను!

641
00:49:10,951 --> 00:49:12,369
నువ్వు నా ఖైదీవని వీళ్ళని నమ్మించడానికి

642
00:49:12,452 --> 00:49:13,829
- ఇలా చేస్తున్నా.
- సరే.

643
00:49:13,912 --> 00:49:16,874
కానీ ఈ హంగామా ఎంతో సేపు కొనసాగదు.

644
00:49:20,627 --> 00:49:22,546
ముప్పై సెకన్లలో ఈ రైలు ఒక సొరంగంలోకి ప్రవేశిస్తుంది.

645
00:49:23,172 --> 00:49:25,257
రైలులో లైట్లు ఆన్ అవ్వడానికి ఒక క్షణం పడుతుంది.

646
00:49:26,008 --> 00:49:27,009
ఓయ్!

647
00:49:27,092 --> 00:49:28,468
క్షమించు.

648
00:49:28,552 --> 00:49:29,803
ఏంటిది!

649
00:49:29,887 --> 00:49:32,306
ఆ క్షణంలో, మనం రైలు ముందు భాగం వైపుకు పరిగెడదాం.

650
00:49:33,098 --> 00:49:34,099
కామ్రేడ్.

651
00:49:34,183 --> 00:49:37,561
ఈ కార్డు గడువు పది సంవత్సరాల క్రితమే ముగిసిపోయింది.

652
00:49:37,644 --> 00:49:38,520
అవునా?

653
00:49:38,604 --> 00:49:40,147
మీ ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటున్నా.

654
00:49:41,773 --> 00:49:42,983
ఎందుకయ్యా?

655
00:49:46,695 --> 00:49:47,529
అక్కడ ఉన్నారు!

656
00:49:47,613 --> 00:49:49,072
వాళ్ళని ఆపండి!

657
00:49:55,245 --> 00:49:57,748
ఏం రైలు ఎక్కించావయ్యా? సైనికుల రైలు ఎక్కించావా?

658
00:50:29,655 --> 00:50:30,948
మనం దూకాలి.

659
00:50:31,031 --> 00:50:34,701
సరే మరి. మూడు లెక్కపెట్టాక దూకాలి. ఒకటి. రెండు.

660
00:50:36,537 --> 00:50:37,538
దేవుడా.

661
00:50:40,666 --> 00:50:43,710
- ఈ రైలులో ఇంకా పరుగెత్తడానికి చోటు లేదు.
- సొరంగం దాటే దాకా ఇది తప్పదు.

662
00:51:04,481 --> 00:51:05,816
సొరంగం బయటకు వచ్చేస్తున్నాం.

663
00:51:21,874 --> 00:51:24,334
కోల్డ్ వార్ అయ్యే దాకా ఆగి ఉంటే బాగుండేదేమో.

664
00:51:33,468 --> 00:51:35,596
రాత్రి తలదాచుకోవడానికి ఓ చోటును వెతుక్కోవాలి మనం.

665
00:51:36,096 --> 00:51:37,764
ఇక్కడ ఓయో హోటల్స్ ఏమైనా ఉన్నాయా?

666
00:51:37,848 --> 00:51:39,349
ఓయో హోటల్స్ అంటే ఏంటి?

667
00:51:40,350 --> 00:51:41,894
ఎక్కడికి వెళ్తున్నావు?

668
00:51:41,977 --> 00:51:43,145
తలదాచుకునే చోటు కోసం.

669
00:51:46,440 --> 00:51:47,608
వీళ్లెవరో నీకు తెలుసా?

670
00:51:47,691 --> 00:51:48,692
లేదు. నాకెలా తెలుసు?

671
00:52:03,207 --> 00:52:05,751
- ఏం చెప్పావు ఆమెకి?
- బయట చల్లగా ఉందని, మనకి ఆకలిగా ఉందని.

672
00:52:05,834 --> 00:52:07,377
ఇక ఆమె లోపలికి రానిచ్చేస్తోందా?

673
00:52:07,461 --> 00:52:09,546
నువ్వేమో మేమందరమూ దుష్టులమని అన్నావు.

674
00:52:19,932 --> 00:52:20,766
వోడ్కా.

675
00:52:20,849 --> 00:52:22,309
- అది…
- "కడుపు నిండా తినండి" అని అంటోంది.

676
00:52:22,392 --> 00:52:24,144
సరే, థ్యాంక్యూ… వద్దండి.

677
00:52:24,228 --> 00:52:25,229
సరే.

678
00:52:25,312 --> 00:52:28,440
ఇక్కడికి ఒక అమెరికా వాడిని
తీసుకురావడం మంచి పనే అంటావా?

679
00:52:28,524 --> 00:52:29,942
నువ్వు మా కజిన్ అని చెప్పా.

680
00:52:30,025 --> 00:52:34,279
వీళ్ళు టీవీలో నా ఫోటోని చూసి ఉంటే?
పోలీసులకి కాల్ చేస్తారేమో కదా.

681
00:52:34,363 --> 00:52:35,697
ఇక్కడ నీకు టీవీ ఏమైనా కనిపిస్తోందా?

682
00:52:36,573 --> 00:52:38,992
- వేరే గదిలో ఉందేమో.
- వేరే గది ఏమైనా కనిపిస్తోందా?

683
00:52:41,620 --> 00:52:43,121
- లేదు, నాకు…
- తీసుకో.

684
00:52:43,205 --> 00:52:45,040
…వేరే గది కనిపించట్లేదు. సరే. థ్యాంక్యూ. సరే మరి.

685
00:52:45,624 --> 00:52:47,167
చూస్తుంటేనే నోరూరిపోతోంది.

686
00:52:55,300 --> 00:52:57,135
ఈ పిల్లాడు ఏంటి ఇలా ఉన్నాడు?

687
00:52:58,053 --> 00:52:59,596
వీడు ఖచ్చితంగా వీళ్ళ బిడ్డ అయ్యి ఉండడు, కదా?

688
00:52:59,680 --> 00:53:01,598
అంతే అయ్యుంటుంది చాలా వరకు.

689
00:53:08,981 --> 00:53:09,982
అతని పేరు గోర్గో.

690
00:53:10,065 --> 00:53:12,442
అతని అమ్మానాన్నలు పని కోసం మాస్కోకు వెళ్లాల్సి వచ్చింది.

691
00:53:12,526 --> 00:53:14,820
ఇప్పుడు ఇతను బామ్మ, తాతయ్య వాళ్ళతో ఉంటున్నాడు.

692
00:53:14,903 --> 00:53:18,031
హేయ్. హేయ్, గోర్గో. ఏంటి సంగతి?

693
00:53:20,325 --> 00:53:23,245
సరే. చేతిని తీసివేస్తా.

694
00:53:31,879 --> 00:53:34,464
ఇతని అమ్మానాన్నలు డబ్బులు పంపిస్తారు,
కానీ వీళ్ళకి దినదినగండంగా గడుస్తోంది.

695
00:53:34,548 --> 00:53:38,468
ఒక్కోసారి, పొయ్యి కోసం బొగ్గును ఆదా చేయాలా,
భోజనం చేయాలా అనేది అర్థం కాక సతమవుతుంటారు.

696
00:53:38,552 --> 00:53:40,304
హా.

697
00:53:40,846 --> 00:53:42,598
మరి… మరి మనకి ఎందుకు ఆశ్రయమిస్తున్నారు?

698
00:53:44,183 --> 00:53:47,769
అమెరికాలో ఎవరైనా
తలుపు దగ్గరికి వచ్చి, ఆదుకోమని అడిగితే,

699
00:53:47,853 --> 00:53:49,396
వాళ్ళు లోపలికి రానివ్వరా?

700
00:53:50,731 --> 00:53:51,899
తప్పకుండా రానిస్తారు.

701
00:53:56,195 --> 00:53:57,196
థ్యాంక్యూ.

702
00:54:05,913 --> 00:54:08,707
భలే ఆసక్తికరంగా ఉంది.
మాపై యుద్ధం ఎలా చేయాలో మీకు వంద మార్గాలు నేర్పారు,

703
00:54:08,790 --> 00:54:11,710
కానీ మా గురించి అసలు విషయం మాత్రం
మీరు తెలుసుకోలేకపోయారు.

704
00:54:13,629 --> 00:54:16,048
నీటి కాకి గురించి నీకు తెలుసా?

705
00:54:16,840 --> 00:54:19,676
ఏంటి… ఏంటి? ఈరాత్రి నువ్వేం
మాట్లాడుతున్నావో నాకు అర్థమే కావట్లేదు.

706
00:54:19,760 --> 00:54:23,013
చేపలని వేటాడేటప్పుడు, నీటి కాకి
సముద్రంలోకి 60 అడుగుల లోతులోకి వెళ్తుంది,

707
00:54:23,096 --> 00:54:25,265
ఒక నిమిషంపైనే నీటి అడుగున ఉంటుంది.

708
00:54:25,349 --> 00:54:27,601
దాని సురక్షితమైన చోటైన నేలని వదిలి
దానికి ప్రమాదకరమైన నీటిలో ఉంటుంది.

709
00:54:27,684 --> 00:54:31,230
కానీ ఆ చేపలని అర్థం చేసుకోవాలంటే
వాటితో కలిసి ఈదడం తప్ప

710
00:54:31,939 --> 00:54:33,524
ఆ పక్షికి మరో దారి లేదు.

711
00:54:36,818 --> 00:54:38,111
కాస్త దీన్ని…

712
00:54:48,539 --> 00:54:50,290
కొంపదీసి మనందరం ఒకే గదిలో పడుకుంటున్నామా ఏంటి?

713
00:55:10,978 --> 00:55:12,813
ఈ రోడ్డులోనే కాస్తంత దూరం వెళ్తే
లేక్ వోజె వచ్చేస్తుందట.

714
00:55:16,191 --> 00:55:17,442
హేయ్. హేయ్…

715
00:55:19,444 --> 00:55:21,405
చూడండి, అది… అది…

716
00:55:21,488 --> 00:55:23,699
అది మీకే. తీసుకోండి.

717
00:55:25,242 --> 00:55:26,952
భలేవారే. ఈ మాత్రమైనా చేయకపోతే ఎలా!

718
00:55:27,035 --> 00:55:28,787
తీసుకోండి.

719
00:55:33,041 --> 00:55:34,543
ఓకే. సరే, థ్యాంక్యూ.

720
00:55:34,626 --> 00:55:35,794
సరే మరి.

721
00:55:35,878 --> 00:55:37,379
బాగుంది. సరే మరి.

722
00:55:37,462 --> 00:55:39,464
మీ భార్య ఫీల్ అయిపోతుంది మళ్ళీ. వెళ్ళండి.

723
00:55:40,632 --> 00:55:41,633
బయలుదేరండి.

724
00:55:43,802 --> 00:55:45,429
చాలా మంచి పని చేశావు నువ్వు.

725
00:55:46,054 --> 00:55:47,973
ఏడాదంతా కష్టపడినా అంత సంపాదించలేడు అతను.

726
00:55:48,891 --> 00:55:52,811
ఇప్పటికైనా ఆ గోర్గో గాడి కోసం, తాళం ఉన్న
ఓ మంచి బోనును కొని దానిలోనే వాడిని బంధించేస్తే పీడా పోతుంది.

727
00:55:57,608 --> 00:56:00,027
అతడిని చూస్తే నాకు ఎందుకో పాపం అనిపిస్తుంది.

728
00:56:00,944 --> 00:56:01,945
గోర్గోని చూసినప్పుడా?

729
00:56:02,029 --> 00:56:03,030
అవును, గోర్గోని.

730
00:56:03,572 --> 00:56:05,616
- వాడు పిశాచి, నిక్.
- వాడు వింతగా ఉన్నాడు.

731
00:56:06,325 --> 00:56:07,951
ఒక పిశాచి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాను.

732
00:56:17,753 --> 00:56:20,297
హా, వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కాదు, కేజీబీ వాళ్ళు.

733
00:56:21,423 --> 00:56:23,592
అంత రక్షణ కేవలం ఉన్నత స్థాయికి
చెందిన కమ్యూనిస్టుకే ఉంటుంది.

734
00:56:25,093 --> 00:56:26,386
కాబట్టి, ఈ బంగళాలో ఎవరున్నా కానీ,

735
00:56:26,470 --> 00:56:28,680
- వాళ్ళ దగ్గర ఆల్తాయి ఫోన్ ఉంటుందా?
- ఉండటానికి అవకాశమెక్కువ ఉంది.

736
00:56:28,764 --> 00:56:31,767
పార్కింగులో కారు లేదు. అంటే,
మనోడు ఊరిలో ఉన్నాడు కానీ ఇంట్లో లేడని అర్థం.

737
00:56:31,850 --> 00:56:32,809
మంచి సమయంలోనే వచ్చాం.

738
00:56:32,893 --> 00:56:34,228
మరి వీళ్ళని దాటి లోపలికి ఎలా వెళ్లడం?

739
00:56:34,311 --> 00:56:36,563
వాళ్ళు స్టాండర్డ్ పద్ధతి అయిన
ఎనిమిది ఆకారంలో నడుస్తూ కాపలా కాస్తున్నారు.

740
00:56:36,647 --> 00:56:39,316
లోపలికి వెళ్ళడానికి అవకాశం వచ్చే దాకా ఆగుదాం.

741
00:56:41,485 --> 00:56:43,445
- అయితే నిన్ను ఫాలో అవ్వనా?
- నన్ను ఫాలో అవ్వు.

742
00:56:47,991 --> 00:56:49,076
ఏం చేస్తున్నావు?

743
00:56:49,159 --> 00:56:50,494
వారి ఛానెల్ కోసం వెతుకుతున్నా.

744
00:56:51,411 --> 00:56:52,788
దొరికేసింది.

745
00:56:58,585 --> 00:56:59,837
పద. వెళదాం పద.

746
00:57:03,465 --> 00:57:05,384
ఆ ట్రిక్కును కేజీబీలో నేర్చుకున్నావా?

747
00:57:05,467 --> 00:57:08,387
లేదు. మీకు బాయ్ స్కౌట్స్ ఉన్నట్టే,
మాకు యంగ్ పయనీర్స్ ఉంది. అక్కడ నేర్చుకున్నా.

748
00:57:08,470 --> 00:57:12,933
స్కౌట్స్ లో, చెక్కతో నెమ్మదిగా కదిలే
కారును ఎలా బిల్డ్ చేయాలో నేర్పారు నాకు.

749
00:57:13,016 --> 00:57:14,101
అది అవసరమయ్యే సందర్భం వస్తే.

750
00:57:14,184 --> 00:57:15,185
ఆ సందర్భం ఎప్పుడూ రాదు.

751
00:57:18,480 --> 00:57:19,648
ఇది కూడా యంగ్ పయనీర్స్ లో నేర్చుకున్నావా?

752
00:57:20,524 --> 00:57:21,567
కేజీబీలో నేర్చుకున్నా.

753
00:57:28,615 --> 00:57:30,993
సరే, నువ్వు పైకెళ్ళి వెతుకు. దీనితో టచ్ లో ఉండు.

754
00:57:31,076 --> 00:57:32,077
అలాగే.

755
00:57:32,786 --> 00:57:34,788
ఆగు. ఈ ఫోన్ ఎలా ఉంటుందో నాకు తెలీదే.

756
00:57:34,872 --> 00:57:37,624
చిన్న సూట్ కేస్ అది. చంటి బిడ్డంత సైజులో ఉంటుంది.

757
00:57:37,708 --> 00:57:38,709
సరే.

758
00:57:46,842 --> 00:57:48,719
ఈ ఫోటోని ఎలా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు అసలు!

759
00:58:06,445 --> 00:58:07,446
సూపర్ గా ఉంది.

760
00:58:08,655 --> 00:58:09,823
నిక్.

761
00:58:13,076 --> 00:58:14,578
ట్రాయ్, ఫోన్ దొరికింది.

762
00:58:14,661 --> 00:58:17,581
మంచిది. ఆ ఫోన్ ద్వారా థెరపిస్టుకు
కాల్ చేసి, ఈ పిల్లాడిని చూపిద్దాం.

763
00:58:19,625 --> 00:58:21,210
- పట్టుకో.
- సూపర్.

764
00:58:21,710 --> 00:58:23,587
ఈ ఇంటి నుండి సురక్షితమైన దూరానికి వెళ్ళాక,

765
00:58:23,670 --> 00:58:24,963
నువ్వు ఎంబసీకి కాల్ చేసేయ్.

766
00:58:41,396 --> 00:58:43,315
ఆమె అతని భార్య కాదు.

767
00:58:44,149 --> 00:58:45,150
సరే.

768
00:58:46,818 --> 00:58:49,655
ఆమె ఒక వేశ్య.

769
00:58:50,447 --> 00:58:52,658
అది నాకు కనిపిస్తోంది. థ్యాంక్యూ.

770
00:58:55,327 --> 00:58:58,121
ఇప్పుడు మనం దగ్గరయ్యాం కాబట్టి

771
00:58:58,956 --> 00:59:01,458
నిన్ను అసాసిన్ అని ఎందుకు పిలుస్తారో చెప్పగలవా?

772
00:59:02,751 --> 00:59:05,337
అయ్య బాబోయ్! ఆ ముక్క
ఇప్పుడు అడుగుతున్నావా నువ్వు?

773
00:59:05,420 --> 00:59:06,463
నాకు తెలుసుకోవాలని చాలా ఉంది.

774
00:59:07,297 --> 00:59:08,549
అది నా వ్యక్తిగత విషయం.

775
00:59:08,632 --> 00:59:09,800
మనం దగ్గరయ్యాం అనుకున్నా.

776
00:59:10,759 --> 00:59:11,760
అంత లేదు.

777
00:59:16,723 --> 00:59:18,809
ఆమె అతని బట్టలు విప్పేస్తోంది.

778
00:59:18,892 --> 00:59:21,603
సరే. హా. నీ… నీ రన్నింగ్ కామెంటరీ ఏమీ అక్కర్లేదు.

779
00:59:21,687 --> 00:59:23,939
- కానీ థ్యాంక్స్.
- ఇక్కడ పైపైనే జరగాలని,

780
00:59:24,022 --> 00:59:26,024
అసలు యవ్వారం పైన గదిలో జరగాలని కోరుకుందాం.

781
00:59:26,108 --> 00:59:29,152
నీ నోట్లో నుండి వచ్చే గాలి వేడికి నా చెవి కాలిపోయేలా ఉంది.

782
00:59:34,700 --> 00:59:37,077
అబ్బా! నా పెళ్ళాం పిల్లలు వచ్చేశారు!

783
00:59:37,160 --> 00:59:38,453
రేపు వస్తారని అన్నావే!

784
00:59:38,537 --> 00:59:39,538
త్వరగా వెళ్ళు!

785
00:59:41,915 --> 00:59:43,834
అటు కాదు! తనకు నువ్వు కనిపిస్తావు!

786
00:59:43,917 --> 00:59:44,918
దాని లోపలికి వెళ్ళు!

787
00:59:45,002 --> 00:59:46,795
బాబోయ్, తను ఇక్కడికే వస్తోంది.

788
00:59:58,557 --> 00:59:59,641
ఎవరు మీరు?

789
01:00:01,059 --> 01:00:02,352
దొంగలం.

790
01:00:05,856 --> 01:00:07,316
నదియా! అప్పుడే వచ్చేశావేంటి?

791
01:00:07,399 --> 01:00:09,318
ట్రాఫిక్ లో చిక్కుకోకూడదని త్వరగా వచ్చేశాం.

792
01:00:09,818 --> 01:00:11,320
మేము వచ్చినందుకు ఆనందంగా లేదా?

793
01:00:11,403 --> 01:00:12,529
ఆనందంగానే ఉంది.

794
01:00:12,613 --> 01:00:15,365
తల బద్దలైపోతుంది. కొంచెం వైన్ కావాలి.

795
01:00:15,449 --> 01:00:16,867
నేను తెస్తాలే.

796
01:00:16,950 --> 01:00:17,993
నువ్వు కూర్చో.

797
01:00:19,578 --> 01:00:21,288
ఇప్పుడు అసలైనోడు వస్తున్నాడు.

798
01:00:43,936 --> 01:00:45,938
ఉదయం నుండి నా తల పగిలిపోతోంది.

799
01:00:46,021 --> 01:00:48,106
అరె. ఇక ఏడ్చింది చాలు!
చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నావు.

800
01:00:48,190 --> 01:00:49,316
నీ స్నానానికి ఏర్పాటు చేస్తా.

801
01:00:49,399 --> 01:00:50,400
అలా తొందరపెట్టేయవద్దు నన్ను.

802
01:00:50,484 --> 01:00:52,736
కారు ప్రయాణంతో బాగా అలసిపోయాను ఇవాళ.

803
01:01:06,250 --> 01:01:08,752
- ఏంటి?
- మీకొక కాల్ వచ్చింది, సర్.

804
01:01:09,461 --> 01:01:10,462
ఇంత పొద్దుపోయాకనా?

805
01:01:11,338 --> 01:01:15,217
అతని గురించి అతను చెప్పేది నిజమే అయితే,
మీరు మాట్లాడాల్సిన అవసరముంది.

806
01:01:17,052 --> 01:01:20,097
నేను కొన్సల్ జనరల్ హెనెస్సీని. ఎవరు మీరు?

807
01:01:20,180 --> 01:01:24,643
నేను లెఫ్టినెంట్ ట్రాయ్ కెల్లీని.
నా యుఎస్ నేవీ సర్వీస్ నంబర్, ఈ02-77-41.

808
01:01:24,726 --> 01:01:27,062
నేను శత్రు నేలపై ఉన్నాను,
నన్ను వెంటనే ఇక్కడి నుండి తీసుకెళ్లిపోవాలి.

809
01:01:27,145 --> 01:01:29,523
ఒక్క నిమిషం ఆగండి, లెఫ్టినెంట్.
ఈ లైన్ లో మనం మాట్లాడే మాటాలను ఎవరైనా వినవచ్చు.

810
01:01:29,606 --> 01:01:31,942
నేను రష్యా వారి ఆల్తాయి
రేడియో టెలిఫోన్ నుండి కాల్ చేస్తున్నా.

811
01:01:32,025 --> 01:01:33,485
వాళ్ళు ఈ కాల్స్ ని వినే అవకాశమే లేదు.

812
01:01:33,569 --> 01:01:36,363
- ఆ ఫోన్ ఎక్కడిది మీకు?
- అది ముఖ్యం కాదు.

813
01:01:36,446 --> 01:01:38,365
సరే మరి, చూడండి, నేను ఎక్కడ ఉన్నానో మీకు చెప్తే,

814
01:01:38,448 --> 01:01:40,409
మీరు సహాయక బృందాన్ని ఎంత త్వరగా పంపగలరు?

815
01:01:40,492 --> 01:01:41,368
ఒక్క నిమిషం ఆగండి.

816
01:01:41,451 --> 01:01:43,161
ఇది అంత తేలిక కాదు.

817
01:01:44,037 --> 01:01:45,497
మీరు రహస్య ఆపరేషన్ లో భాగంగా వచ్చారు.

818
01:01:45,581 --> 01:01:47,666
ఈ దేశంలో మీరు ఉన్నట్టు యుఎస్ గుర్తించలేదు.

819
01:01:47,749 --> 01:01:51,461
రష్యా నేలపై నుండి మిమ్మల్ని సురక్షితమైన చోటుకు
తరలిస్తే, మనం నిఘా పెట్టామని ఒప్పుకున్నట్టే అవుతుంది.

820
01:01:51,545 --> 01:01:52,880
మరి ఇప్పుడు నేనేం చేయాలి?

821
01:01:54,423 --> 01:01:57,759
మీరు సరిహద్దు దాటినా,
లేదా మాస్కోలో ఉండే మన ఎంబసీకి వచ్చినా,

822
01:01:57,843 --> 01:01:59,052
మనం స్వతంత్రంగా ఏమైనా చేయవచ్చు.

823
01:01:59,136 --> 01:02:01,430
అప్పుడు మిమ్మల్ని స్వదేశానికి తరలిస్తాం.
మీ దగ్గర బండి ఏమైనా ఉందా?

824
01:02:04,558 --> 01:02:05,559
ఉంది.

825
01:02:06,768 --> 01:02:09,730
ఇంకో విషయం. ఒక రష్యా వాడు ఉన్నాడు.

826
01:02:10,272 --> 01:02:11,273
అతనే నాకు సాయపడుతూ ఉన్నాడు.

827
01:02:11,356 --> 01:02:15,569
అతని పేరు నిక్… నికోలాయ్ ఉస్తినోవ్. అతనికి,
అతని కూతురుకి మన దేశం ఆశ్రయం ఇస్తుందని మాటిచ్చాను.

828
01:02:15,652 --> 01:02:17,279
దాని గురించి నేను అంబాసిడర్ తో మాట్లాడాల్సి ఉంటుంది.

829
01:02:17,362 --> 01:02:19,698
మీరు ఆ పని మీద ఉండండి.
మాస్కోకు వచ్చాక మీకు కాల్ చేస్తా.

830
01:02:21,366 --> 01:02:22,910
తీసుకెళ్లడానికి ఎక్కడికైనా రమ్మన్నారా?

831
01:02:22,993 --> 01:02:26,079
హా, మాస్కోలోని ఎంబసీకి రమ్మన్నారు.
వాళ్ళ దగ్గరికే రమ్మంటున్నారు.

832
01:02:26,705 --> 01:02:31,460
కానీ నువ్వు అమెరికన్ హీరోవి కదా.
వాళ్ళే వచ్చి ఎందుకు తీసుకెళ్లట్లేదు?

833
01:02:32,711 --> 01:02:34,755
చాలా పెద్ద విషయాలు ముడిపడి ఉన్నాయి అనుకుంటా.

834
01:02:36,507 --> 01:02:38,675
సరే. ముందు నా కూతురిని పికప్ చేసుకుందాం.

835
01:02:39,259 --> 01:02:41,261
తనకి మెసేజ్ పంపి, తన చిరునామా అడుగుతా.

836
01:02:41,762 --> 01:02:44,515
- తనెక్కడ ఉంటుందో నీకు తెలీదా?
- తను ఒక ఇంట్లో కుదురుగా ఉండదు.

837
01:02:45,807 --> 01:02:47,142
కానీ ఒక శుభవార్త చెప్పనా?

838
01:02:47,226 --> 01:02:48,519
ఏంటది?

839
01:02:48,602 --> 01:02:50,062
మన దగ్గర క్యాసెట్ ప్లేయర్ ఉంది.

840
01:02:51,480 --> 01:02:53,482
ఆ ఒక్క టేపు వింటూ 12 గంటలు గడిపేద్దాం.

841
01:02:56,944 --> 01:02:58,403
పాటలో నాన్న ఎవరు?

842
01:02:58,487 --> 01:03:00,614
అది నాకు కూడా తెలీదు.

843
01:03:51,081 --> 01:03:53,417
ఈరాత్రి ఎంబసీకి వెళ్లేసరికి బాగా పొద్దుపోతుంది.

844
01:03:53,500 --> 01:03:55,127
మనం నా కూతురి దగ్గర ఉందాం.

845
01:03:56,420 --> 01:03:57,880
తను ఉండనిస్తే.

846
01:03:57,963 --> 01:03:59,798
మాస్కో ఎప్పుడూ ఇంత గంభీరంగానే ఉంటుందా?

847
01:03:59,882 --> 01:04:02,217
రేపు జరగబోయే మే పరేడ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.

848
01:04:02,301 --> 01:04:04,178
సోవియెట్ సైనిక శక్తిని ప్రదర్శిస్తారు.

849
01:04:04,261 --> 01:04:06,930
వీధులన్నీ సైనికులతో, ఆయుధాలతో నిండిపోతాయి.

850
01:04:07,848 --> 01:04:10,350
అమెరికాలో, మేము… ఒక స్నూపీ బెలూన్ ని ఎగరేస్తామంతే.

851
01:04:10,976 --> 01:04:12,644
థ్యాంక్స్ గివింగ్ పరేడ్ లో. పరమ బోరింగ్.

852
01:04:17,566 --> 01:04:19,985
ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే మేలు అనుకుంటా.

853
01:04:22,696 --> 01:04:27,409
డెప్యూటీ చైర్మన్, దుకోవ్ కి
చెందిన ఆల్తాయి ఫోన్ ఇక్కడ దొంగతనానికి గురైంది.

854
01:04:27,492 --> 01:04:30,078
ఇక్కడి నుండి కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే

855
01:04:30,162 --> 01:04:34,666
రైలులో మన సైనికులకు
మనం వెతుకున్న వారు కనిపించారు.

856
01:04:34,750 --> 01:04:36,210
దొంగతనం ఎప్పుడు జరిగింది?

857
01:04:36,293 --> 01:04:38,670
సుమారుగా రాత్రి తొమ్మిది గంటలకి.

858
01:04:42,925 --> 01:04:47,554
వావ్. మానిటరింగ్ ఆఫ్ చేసిన ఫోన్ నుండి
రాత్రి 10:14కి యుఎస్ ఎంబసీకి కాల్ వెళ్ళింది.

859
01:04:48,138 --> 01:04:49,473
అది అతని పనే అయ్యుంటుంది.

860
01:04:59,566 --> 01:05:00,943
అతను ఇక్కడికే వస్తున్నాడు.

861
01:05:01,026 --> 01:05:02,986
ఈ విషయం నేను జనరల్ సెక్రెటరీకి చెప్తాను.

862
01:05:03,070 --> 01:05:04,446
వద్దు.

863
01:05:04,530 --> 01:05:08,200
మన అమెరికన్ మిత్రుడిని స్వయంగా నేనే కలుసుకుంటా.

864
01:05:16,708 --> 01:05:18,210
ఈ చోటు బాగుంది.

865
01:05:19,920 --> 01:05:21,255
అంత బాగా లేదు.

866
01:05:33,642 --> 01:05:34,977
- ఎందుకలా చేశావు?
- నా వెంటే రా.

867
01:05:42,234 --> 01:05:43,151
ఇంటి నంబర్, 709 అని పక్కానా?

868
01:05:43,235 --> 01:05:44,778
ఇది కాదు, 809. పద, మెట్ల మీద నుండి వెళదాం.

869
01:05:46,280 --> 01:05:47,573
రా.

870
01:05:49,533 --> 01:05:51,785
హేయ్, కారును ఐస్ మీదకి తీసుకెళ్లి
నన్ను హెచ్చరించకుండానే

871
01:05:51,869 --> 01:05:53,620
కారును ముంచేయాలని చూశావు కదా?

872
01:05:54,121 --> 01:05:55,497
ఇప్పుడూ అలాంటిదే జరగబోతుందేమో అనిపిస్తోంది.

873
01:05:59,126 --> 01:06:00,127
హలో, ఆనా.

874
01:06:01,086 --> 01:06:02,629
మాకు ఆశ్రయమివ్వగల సేఫ్ హౌస్ ఏమైనా ఉందా?

875
01:06:03,255 --> 01:06:04,173
ఉంది.

876
01:06:05,883 --> 01:06:06,884
హాయ్.

877
01:06:33,911 --> 01:06:35,412
సరే మరి, ఏంటి ఈ పనులన్నీ?

878
01:06:35,495 --> 01:06:38,707
ఈ బిల్డింగ్ పై నలుగురు సెక్యూరిటీ వాళ్ళు నిఘా ఉంచారు.

879
01:06:38,790 --> 01:06:40,250
కానీ వాళ్లకి మనం చిక్కం.

880
01:06:44,463 --> 01:06:45,672
ఎనిమిదవ అంతస్థుకు వెళదాం.

881
01:07:09,238 --> 01:07:10,739
ఇది మీ సొంత ఇల్లా, అద్దెకి ఉంటున్నారా?

882
01:07:13,867 --> 01:07:15,118
ఆనా, రా.

883
01:08:05,210 --> 01:08:06,545
అన్నట్టు, నా పేరు ట్రాయ్.

884
01:08:06,628 --> 01:08:07,629
- ఆనా.
- మిమ్మల్ని కలవడం బాగుంది.

885
01:08:11,466 --> 01:08:12,885
రేపు ఉదయాన్నే,

886
01:08:12,968 --> 01:08:14,928
ఆల్తాయి ఫోన్ ద్వారా ట్రాయ్, ఎంబసీకి కాల్ చేస్తాడు,

887
01:08:15,012 --> 01:08:17,014
మన ముగ్గురం ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్లిపోవచ్చు.

888
01:08:19,308 --> 01:08:21,143
ఇదంతా నిజమేనా? మీరు ఎయిర్ ఫోర్స్ పైలటా?

889
01:08:22,269 --> 01:08:23,687
కాదు, నేవీ పైలట్ ని.

890
01:08:23,770 --> 01:08:26,564
మా ఫోర్సులో నౌకలు, విమానాలు కూడా ఉంటాయి.
కాస్త అయోమయంగానే ఉంటుందిలే.

891
01:08:28,317 --> 01:08:30,944
మనం మాట్లాడుకొని ఎన్ని రోజులైందో తెలుసా?

892
01:08:32,446 --> 01:08:34,072
నేను నీతో వస్తానని అసలెలా అనుకున్నావు?

893
01:08:34,156 --> 01:08:36,325
మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడానికి ఇది అవకాశం అనుకో.

894
01:08:36,408 --> 01:08:37,408
నేనేం నీలాంటి దాన్ని కాదు.

895
01:08:39,536 --> 01:08:42,038
అడవుల్లోకి పారిపోయి, దాక్కొని జీవించాలని నాకు లేదు.

896
01:08:42,747 --> 01:08:44,750
ఎంత కష్టమైనా నాకున్న ఇంట్లోనే బతుకుతా.

897
01:08:44,832 --> 01:08:46,542
ఇక్కడే ఉంటే నీకు ప్రమాదం.

898
01:08:47,377 --> 01:08:49,421
ప్రమాదం ఎప్పట్నుంచో నా జీవితంలో భాగమైపోయింది.

899
01:08:50,714 --> 01:08:52,633
కావాలంటే నువ్వు అమెరికాకి వెళ్ళిపో.

900
01:08:55,051 --> 01:08:57,970
"అయ్యో, ఎందుకలా చేశా?" అని
బాధపడటానికి నీకు చాలా విషయాలు ఉన్నాయి.

901
01:08:58,055 --> 01:09:00,307
నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు నీకు బాధ కలగకూడదు.

902
01:09:06,438 --> 01:09:08,189
స్టవ్ పని చేస్తోందా?

903
01:09:08,273 --> 01:09:10,359
ఈ చోటిని కూడా పేల్చేయాలనుకుంటున్నావా ఏంటి?

904
01:09:10,442 --> 01:09:11,401
నేను టీ చేస్తున్నా.

905
01:09:11,484 --> 01:09:12,944
నాకు కూడా ఇవ్వబ్బా.

906
01:09:16,156 --> 01:09:18,283
మీరు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారా?

907
01:09:21,118 --> 01:09:23,913
నేను మానవ హక్కుల కోసం పోరాడే సంస్థలో పని చేస్తున్నా.

908
01:09:24,747 --> 01:09:25,832
ఇక్కడ అలాంటి వాటికి అనుమతిస్తారా?

909
01:09:27,835 --> 01:09:29,837
వాళ్లకి తెలిసిన వాటినే కదా నిషేధించగలరు.

910
01:09:29,920 --> 01:09:32,798
పట్టుకోగలిగిన వాళ్లనే శిక్షించగలరు.

911
01:09:32,881 --> 01:09:35,384
కాబట్టి, మా గుట్టును బయటపెట్టడానికి
నాన్న లాంటి వారిని నియమించుకుంటారు.

912
01:09:37,803 --> 01:09:39,763
ఈ కుట్లని మీరే వేసుకున్నారా?

913
01:09:39,846 --> 01:09:41,765
లేదు, లేదు. మీ నాన్న వేశాడు.

914
01:09:41,849 --> 01:09:44,768
ఆయన గాయపరిచే రకం, గాయాలను నయం చేసే రకం కాదు.

915
01:09:44,852 --> 01:09:47,479
ఈ రాత్రి మాకు ఆశ్రయమిచ్చినందుకు థ్యాంక్స్.

916
01:09:47,563 --> 01:09:50,858
నాకు మరో దారి లేదు. మీ వల్ల
మా నాన్న కామ్రేడ్స్ నా ఇంటికి వచ్చేశారు.

917
01:09:51,774 --> 01:09:53,443
మాజీ కామ్రేడ్స్ కదా.

918
01:09:55,195 --> 01:09:56,196
అవునులే.

919
01:09:59,241 --> 01:10:01,285
మా నాన్న మీకేం చెప్పాడో నాకు తెలీదు,

920
01:10:02,703 --> 01:10:04,621
కానీ నేనైతే అతడిని అంతగా నమ్మను.

921
01:10:05,497 --> 01:10:08,000
- అవును.
- అబద్ధాలు చెప్పడం ఆయన వృత్తి.

922
01:10:08,083 --> 01:10:09,710
నాకది అర్థమైపోయింది. కానీ,

923
01:10:09,793 --> 01:10:12,880
రెండ్రోజుల్లో ఆయన నా ప్రాణాన్ని వందసార్లు కాపాడాడు,

924
01:10:12,963 --> 01:10:15,340
కాబట్టి, ఆయన మారాడని నేను నమ్ముతున్నా.

925
01:10:15,424 --> 01:10:19,219
సరే. మీరు మీ పెళ్ళాం పిల్లల దగ్గరికి
క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నా.

926
01:10:20,095 --> 01:10:21,889
పెళ్ళాం పిల్లలు ఎవరూ లేరు, నాన్న ఒక్కడే.

927
01:10:22,556 --> 01:10:26,018
నిజంగానా? మీ అంత అందమైన
అమెరికన్ పైలట్ కి పెళ్ళాం పిల్లలు లేరా?

928
01:10:26,101 --> 01:10:28,604
మీకు పెళ్ళాం పిల్లలు ఉంటారని

929
01:10:29,521 --> 01:10:31,523
చక్కటి చెక్క ఫెన్సింగ్ తో
ఒక ఇల్లు ఉంటుందని అనుకున్నానే.

930
01:10:31,607 --> 01:10:33,942
లేదు. చెయిన్ ఫెన్సింగ్ గల అపార్టుమెంట్ లో ఉంటున్నా.

931
01:10:34,026 --> 01:10:36,528
నేనెక్కువ పని మీదే దృష్టి పెడుతున్నా.

932
01:10:37,613 --> 01:10:40,032
ఆ పని సత్ఫాలితాలనే ఇస్తున్నట్టుంది.

933
01:10:40,782 --> 01:10:41,909
థ్యాంక్స్.

934
01:10:41,992 --> 01:10:44,578
మీ సంగతేంటి? మీ మనస్సును
దోచుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా?

935
01:10:49,041 --> 01:10:50,042
మగాళ్ళంటే నాకు పడదులే.

936
01:10:50,626 --> 01:10:51,668
భలేవారే, మరీ మగాళ్లందరూనా?

937
01:10:58,050 --> 01:11:02,304
నేను మీకు ఆశ్రయమిస్తున్నా కాబట్టి, దీన్ని మీరు
రహస్యంగా ఉంచగలరనే అనుకుంటున్నా.

938
01:11:02,387 --> 01:11:03,805
ఇది నిక్ కి తెలుసా?

939
01:11:08,602 --> 01:11:11,188
సోవియెట్ యూనియన్ లో స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం.

940
01:11:11,688 --> 01:11:13,941
ఆ చట్టాన్ని అమలయ్యేలా చూసుకునేది కేజీబీ వాళ్ళే.

941
01:11:16,276 --> 01:11:17,277
అవునులే.

942
01:11:23,784 --> 01:11:25,160
ఆనా మాత్రం సూపర్.

943
01:11:26,787 --> 01:11:28,330
నీకంటే సున్నితంగా, బాగా కుట్టింది.

944
01:11:29,081 --> 01:11:30,958
తను చాలా స్పెషల్.

945
01:11:32,751 --> 01:11:35,045
మా మధ్య సంబంధం మరింత బాగా ఉండుంటే బాగుండేది.

946
01:11:35,128 --> 01:11:36,672
తనకి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది.

947
01:11:42,344 --> 01:11:44,096
నువ్వు… నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదా?

948
01:11:45,681 --> 01:11:47,891
మావెరిక్ చేసిన తప్పులే నువ్వు కూడా చేస్తున్నావు.

949
01:11:47,975 --> 01:11:49,059
"టాప్ గన్"లోని మావెరికా?

950
01:11:49,142 --> 01:11:51,478
- వేరే మావెరిక్ ఎవరైనా తెలుసా నీకు?
- తెలీదు.

951
01:11:51,562 --> 01:11:52,563
గూస్ చనిపోయాక,

952
01:11:52,646 --> 01:11:56,275
మావ్, "అది ఇలా చేసి ఉంటే బాగుండేది.
ఇది అలా చేసి ఉంటే బాగుండేది" అని కుమిలిపోతాడు.

953
01:11:56,358 --> 01:12:00,487
అతనికి చాలా విషయాలు చెప్పి ఉండాల్సిందని
బాధపడతాడు. కానీ అప్పటికే బాగా ఆలస్యమైపోయింది కదా.

954
01:12:01,905 --> 01:12:04,074
ఇప్పటికీ మించిపోయింది లేదు, వెళ్లి ఆనాతో మాట్లాడు.

955
01:12:05,117 --> 01:12:06,118
ఎవరికి తెలుసు?

956
01:12:06,201 --> 01:12:10,372
ఒకరి గురించి మరొకరికి తెలీని
మీ విషయాలు ఇప్పుడు తెలుస్తాయేమో.

957
01:12:10,455 --> 01:12:11,456
ఎలాంటి విషయాలు?

958
01:12:11,540 --> 01:12:13,876
అదే, వ్యక్తిగత విషయాలు. అంటే, సొంత…

959
01:12:13,959 --> 01:12:15,711
అంటే, తను అమ్మాయిలను ఇష్టపడుతుందనే విషయమా?

960
01:12:16,795 --> 01:12:18,714
- ఒక్క నిమిషం, అది నీకు తెలుసా?
- హా, నాకెప్పుడో తెలుసు.

961
01:12:18,797 --> 01:12:21,175
కేజీబీ నుండి నేను బయటకు
వచ్చేయడానికి అది కూడా ఒక కారణం.

962
01:12:21,675 --> 01:12:24,720
నా కన్న బిడ్డని నేరస్థురాలిగా
చూసే చోట నేనెలా పని చేయగలను?

963
01:12:25,554 --> 01:12:28,056
మరి… మరి దాని గురించి తనతో ఎందుకు మాట్లాడలేదు?

964
01:12:28,140 --> 01:12:32,269
చూడు, దాని గురించి మాట్లాడాలని
ఆనాకి ఉంటే, తనే వస్తుంది కదా.

965
01:12:32,352 --> 01:12:33,604
తొక్కేం కాదు.

966
01:12:33,687 --> 01:12:34,688
నువ్వు తండ్రివి.

967
01:12:35,314 --> 01:12:38,525
నీ ముందు తనెవరో దాచాల్సిన
అవసరం లేదని తనకి అర్థమయ్యేలా నువ్వే ప్రవర్తించాలి.

968
01:12:41,778 --> 01:12:44,072
ఫైటర్ పైలట్లందరూ నీలానే సున్నితంగా ఉంటారా?

969
01:12:44,156 --> 01:12:45,157
అవును.

970
01:12:50,787 --> 01:12:54,374
నీతో మాట్లాడొచ్చా?

971
01:12:56,793 --> 01:12:57,794
చెప్పు.

972
01:14:38,687 --> 01:14:41,440
నాన్నా, నువ్వు అమెరికాకు చేరుకున్నాక కాల్ చేయి.

973
01:14:41,523 --> 01:14:44,067
నా గురించి దిగులు పడకు.

974
01:14:49,031 --> 01:14:51,617
సాధారణంగా మా బిల్డింగ్ పై
స్టేట్ సెక్యూరిటీ నిఘా పెట్టి ఉంచుతుంది,

975
01:14:51,700 --> 01:14:54,161
కాబట్టి తొమ్మిదింటికి నేరుగా గేట్ దగ్గరికి వచ్చేయండి.

976
01:14:54,244 --> 01:14:57,122
ఇక్కడ మిమ్మల్ని విచారించి,
సాయంత్రానికల్లా రామ్ స్టెయిన్ కి పంపించడం జరుగుతుంది.

977
01:14:57,206 --> 01:14:58,707
అలాగే. థ్యాంక్యూ, సర్.

978
01:14:58,790 --> 01:15:00,292
ఒక్క నిమిషం ఆగండి, లెఫ్టినెంట్.

979
01:15:00,375 --> 01:15:01,960
నేను అంబాసిడరుతో మాట్లాడాను.

980
01:15:03,045 --> 01:15:06,507
దురదృష్టవశాత్తూ, మీకు తోడుగా ఉన్న
ఇక్కడి పౌరునికి ఆశ్రయం ఇవ్వడం కుదరదు.

981
01:15:06,590 --> 01:15:08,592
ఒక్క నిమిషం. మీకు విషయం అర్థం కావట్లేదు.

982
01:15:09,092 --> 01:15:13,222
నిక్ లేకపోతే నేను ఇక్కడికి చేరుకోగలిగేవాడిని కాదు.
అతడిని అమెరికాకి చేరుస్తానని నేను మాటిచ్చాను.

983
01:15:13,305 --> 01:15:17,267
అర్థమైంది, కానీ నికోలాయ్ ఉస్తినోవ్ మామూలు పౌరుడు కాదు.

984
01:15:17,351 --> 01:15:18,852
అతను కేజీబీలో పని చేశాడని తెలుసా?

985
01:15:18,936 --> 01:15:21,146
హా, తెలుసు. అతనే చెప్పాడు. కానీ మానేశాడు.

986
01:15:21,230 --> 01:15:24,775
యుఎస్-సోవియెట్ సంబంధాల కోణం నుండి చూస్తే,
ఇది చాలా సున్నితమైన విషయమని చెప్పవచ్చు.

987
01:15:24,858 --> 01:15:27,903
ప్రస్తుతం పని చేస్తున్నాడా, మానేశాడా అన్నదానితో
సంబంధం లేదు, కేజీబీ ఏజెంట్ కి ఆశ్రయం ఇవ్వలేం…

988
01:15:27,986 --> 01:15:29,404
జోక్ చేస్తున్నారా?

989
01:15:29,488 --> 01:15:31,490
అతను కీలక వ్యక్తి కాగలడు.

990
01:15:31,573 --> 01:15:33,951
సోవియెట్ ఆపరేషన్స్ గురించి తెలుసుకోవడానికి
ఉపయోగపడగలడు. నిజానికి, మీరు సంబరపడాలి.

991
01:15:34,034 --> 01:15:36,954
నేనేమీ చేయలేను. ఇది అత్యున్నత
స్థాయిలో ఉన్నవారు తీసుకున్న నిర్ణయం.

992
01:15:37,037 --> 01:15:39,039
ఇప్పుడు నేనతనికి ఏం చెప్పాలి?

993
01:15:39,540 --> 01:15:42,084
అతను నన్ను నమ్మాడు. అమెరికాని కూడా నమ్మాడు.

994
01:15:42,918 --> 01:15:45,087
అతడిని నేను వదిలేసి వచ్చేస్తే,
వీళ్ళకి, మనకి తేడా ఏమీ ఉండదు.

995
01:15:45,170 --> 01:15:46,588
ఇది చాలా దారుణం.

996
01:15:47,589 --> 01:15:49,967
ఈ ఉదయం తొమ్మిందింటికల్లా మీరు వస్తారా, రారా?

997
01:15:54,847 --> 01:15:55,848
వస్తా.

998
01:16:06,400 --> 01:16:07,609
ఇక పెద్ద సమయమేమీ పట్టదు.

999
01:16:10,404 --> 01:16:12,948
చూడు, నిక్, మనం అక్కడికి చేరుకోక ముందు…

1000
01:16:13,740 --> 01:16:17,244
నేను… నేను ఎంబసీ వాళ్ళతో మాట్లాడినప్పుడు,
వాళ్ళు నాకు ఒక చేదు వార్త చెప్పారు…

1001
01:16:17,327 --> 01:16:20,539
ముందుకు… ముందుకు దారి లేదా? ఏంటి…

1002
01:16:26,503 --> 01:16:27,546
ఏం చేస్తున్నావు?

1003
01:16:27,629 --> 01:16:29,214
మనం స్నేహితులమని భ్రమపడ్డాను.

1004
01:16:30,340 --> 01:16:31,550
నిక్, నన్ను పట్టించేస్తున్నావా?

1005
01:16:31,633 --> 01:16:34,136
నన్ను, నా కూతురిని
ఈ మృగాల మధ్య వదిలేసి వెళ్ళిపోతున్నావు.

1006
01:16:35,929 --> 01:16:37,848
అబ్బా, నిక్. పొరబడ్డావు నువ్వు.

1007
01:16:39,766 --> 01:16:40,767
ఏం చేశావు?

1008
01:16:41,268 --> 01:16:44,229
వదలండి! హేయ్! హేయ్, నిక్!

1009
01:17:04,625 --> 01:17:07,461
మనం అనుకున్నదేంటి! మీరు చేస్తున్నదేంటి!

1010
01:17:14,384 --> 01:17:16,720
వోల్కోవ్ ని పిలవండి. ఇది దారుణం.

1011
01:17:17,554 --> 01:17:18,639
అబ్బో, వచ్చేశావుగా.

1012
01:17:19,973 --> 01:17:21,683
కాల్ చేసి నన్ను పట్టించావు కదా,
ఇప్పుడు సమ్మగా ఉందా?

1013
01:17:21,767 --> 01:17:23,852
నువ్వు అబద్ధాలకోరువి. ఇక్కడి నుండి
నన్ను తీసుకెళ్తానని మాటిచ్చావు.

1014
01:17:23,936 --> 01:17:26,480
మనం ఎంబసీకి వెళ్ళినప్పుడు, నీకు
ఆశ్రయమిచ్చేలా వారిని ఒప్పిద్దామనుకున్నా.

1015
01:17:26,563 --> 01:17:29,024
ఇంకో అబద్ధం! ఆశ్రయమివ్వడానికి
వాళ్ళు ఒప్పుకోలేదని ముందే ఎందుకు చెప్పలేదు?

1016
01:17:29,107 --> 01:17:30,567
అప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడివే కాదు.

1017
01:17:30,651 --> 01:17:31,860
చూశావా? నువ్వు… దరిద్రుడివి.

1018
01:17:31,944 --> 01:17:34,571
నిన్ను ఇక్కడే వదిలేసి
వెళ్ళేవాడిని కాదని ప్రమాణపూర్తిగా చెప్తున్నా.

1019
01:17:34,655 --> 01:17:36,198
నేను… నేను అలాంటి వాడిని కాదు.

1020
01:17:37,032 --> 01:17:38,492
నువ్వెలాంటి వాడివో నాకు తెలీదు.

1021
01:17:38,575 --> 01:17:41,328
నీకు బాగా తెలుసు. నేను "టాప్ గన్"ని.
నేను మావెరిక్ ని. నేనంటే నీకు ఇష్టం కదా.

1022
01:17:42,704 --> 01:17:45,040
అది సినిమానే. ఇప్పుడు అర్థమవుతోంది నాకు.

1023
01:17:47,167 --> 01:17:48,126
నిక్…

1024
01:17:51,046 --> 01:17:52,172
మిత్రులారా.

1025
01:17:53,048 --> 01:17:54,842
నువ్వు అబద్దమాడావు.
నన్ను విడుదల చేస్తావని చెప్పావు.

1026
01:17:55,467 --> 01:17:58,345
నిన్ను విడుదల చేస్తా. మీలో ఒకరు విడుదల అవుతారు.

1027
01:17:59,179 --> 01:18:00,931
- ఏంటిది?
- నేరాంగీకారం.

1028
01:18:01,682 --> 01:18:03,600
నీకు ఇచ్చిన దానిలో

1029
01:18:04,142 --> 01:18:07,521
క్రెమ్లిన్ లోకి చొరబడి ప్రెసిడెంట్ గోర్బచెవ్ ని
చంపడమే నీ మిషన్ అని ఉంటుంది.

1030
01:18:08,021 --> 01:18:11,024
నీకు ఇచ్చిన దానిలో, తన మిషన్ గురించి
నీకు చెప్పినట్టుగా సమ్మతిస్తున్నట్టు ఉంటుంది.

1031
01:18:12,276 --> 01:18:13,610
అది నిజం కాదే.

1032
01:18:13,694 --> 01:18:18,115
కానీ తగినంత మంది దీన్ని నమ్మితే,
ఈ స్వేచ్చా రాజకీయ వాతావరణానికి తెర పడిపోతుంది.

1033
01:18:19,616 --> 01:18:20,742
స్వేచ్చా జీవితానికి తెరపడుతుంది.

1034
01:18:21,243 --> 01:18:24,663
వాటి వల్ల అసంతృప్తి జ్వాలలు,
అల్లర్లు తప్ప మనకి ఒరిగిందేమీ లేదు.

1035
01:18:25,455 --> 01:18:28,375
నువ్వు సంతకం చేశాక,
నిన్ను ఇక్కడే బాగా చూసుకుంటాం.

1036
01:18:29,501 --> 01:18:33,297
కొత్త ఐడెంటిటీ ఇస్తాం, నీ ఊహలకు కూడా
అందని స్థాయిలో రాజభోగాలని అందిస్తాం.

1037
01:18:33,380 --> 01:18:37,968
సర్, మీరు మామూలు దరిద్రులు కాదు.
మీరు చెప్పింది కూడా దరిద్రంగా ఉంది.

1038
01:18:38,051 --> 01:18:41,305
శత్రు నేలపై ఉన్న నిన్ను సురక్షితంగా
తీసుకెళ్లడానికి మీ దేశం ఒప్పుకోలేదు,

1039
01:18:41,388 --> 01:18:44,183
- నీ పాటికి నిన్ను వదిలేసింది,
- నా వృత్తిలో ఇవన్నీ భాగమే అని నాకు తెలుసు.

1040
01:18:45,559 --> 01:18:46,727
మరి మీ నాన్న సంగతేంటి?

1041
01:18:48,145 --> 01:18:52,441
ఆయనకి తెలుసా ఆయన ప్రభుత్వమే
ఆయన్ని చంపుతోందని, దానికి బాధ్యత కూడా తీసుకోవడం లేదని?

1042
01:18:53,192 --> 01:18:54,651
ఏమన్నావు?

1043
01:18:54,735 --> 01:18:56,320
మేము రీసెర్చ్ క్షుణ్ణంగా చేస్తాం.

1044
01:18:59,656 --> 01:19:00,949
హారోల్డ్ కెల్లీ.

1045
01:19:01,617 --> 01:19:05,329
1983లో ఆయనకి లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసింది.

1046
01:19:05,412 --> 01:19:08,207
శాన్ డియెగో షిప్ యార్డులలో 32 ఏళ్ళు పని చేశాడు,

1047
01:19:08,290 --> 01:19:12,586
ఆయన పని చేసే చోట ఆస్బెస్టాస్ చాలా ఎక్కువ ఉండేది.

1048
01:19:12,669 --> 01:19:14,004
ఇది అమెరికా తప్పా?

1049
01:19:14,087 --> 01:19:17,216
వాళ్లకి ఆ ప్రమాదం గురించి తెలుసు,
కానీ డబ్బు ఆదా అవుతుందని, ఎన్నో దశాబ్దాల నుండి

1050
01:19:17,299 --> 01:19:18,425
ఆ సమాచారాన్ని దాచి ఉంచుతున్నారు.

1051
01:19:19,009 --> 01:19:20,010
అవన్నీ నీకెలా తెలుసు?

1052
01:19:21,178 --> 01:19:24,348
సెప్టెంబర్ 1956లో, మీ నేవీ సెక్రెటరీ రాసిన రహస్య లేఖకు

1053
01:19:24,431 --> 01:19:26,892
కాపీ ఇది.

1054
01:19:26,975 --> 01:19:28,852
మేము రీసెర్చ్ క్షుణ్ణంగా చేస్తామని చెప్పా కదా.

1055
01:19:30,062 --> 01:19:31,605
దేశాలు కూడా ప్రజల్లానే.

1056
01:19:32,898 --> 01:19:35,859
మనుగడ సాగించడానికి అవి ఎంతకైనా తెగించాల్సి వస్తుంది.

1057
01:19:36,735 --> 01:19:39,613
కానీ నువ్వు అలా చేయగలవా అనేదే అసలు ప్రశ్న.

1058
01:19:44,243 --> 01:19:45,244
నేను…

1059
01:19:46,578 --> 01:19:50,249
నేను ఇక్కడికి రాక ముందు, ఈ…
ఈ దేశం గురించి నాకు బాగా తెలుసని భ్రమపడ్డాను.

1060
01:19:50,874 --> 01:19:52,876
కానీ నాకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి.

1061
01:19:53,794 --> 01:19:56,380
ఇక్కడ మంచి వాళ్ళు కూడా ఉంటారని నాకు తెలీదు.

1062
01:19:57,214 --> 01:20:00,259
ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏ పరిచయమూ
లేని వాడికి సాయపడే వాళ్లుంటారని తెలుసుకున్నాను.

1063
01:20:02,052 --> 01:20:04,888
కాబట్టి, నేను… నేను దానిపై సంతకం చేయను.

1064
01:20:06,348 --> 01:20:09,351
నా దేశం కోసమని కాదు. మీ దేశం కోసమనే.

1065
01:20:12,396 --> 01:20:13,564
మరి నువ్వు, కామ్రేడ్?

1066
01:20:13,647 --> 01:20:16,483
ఇతడిని అప్పగించి నీ విధేయతను నిరూపించుకున్నావు.

1067
01:20:17,150 --> 01:20:20,404
నీ దేశం కోసం ఇంకో ఆఖరి అడుగు వేయడానికి సిద్ధమేనా?

1068
01:20:23,156 --> 01:20:24,616
నీ కుటుంబం కోసం?

1069
01:20:30,789 --> 01:20:32,124
విధేయత అంటే ఏంటి అసలు?

1070
01:20:32,791 --> 01:20:34,418
మనుషులని పిచ్చోళ్ళని చేయడానికి వాడే ఆయుధం అది.

1071
01:20:34,501 --> 01:20:36,628
అమెరికా. రష్యా. అంతా సోది.

1072
01:20:37,421 --> 01:20:39,089
మనం చేసిన నీచ పనులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

1073
01:20:40,465 --> 01:20:43,218
సంతకం చేస్తే నాకు, నా కుటుంబానికి
ఏమీ కాదంటే, సంతకం పెడతాను.

1074
01:20:43,302 --> 01:20:44,303
నిక్.

1075
01:20:45,095 --> 01:20:46,847
ఏదైనా ఒకటేలే.

1076
01:20:47,598 --> 01:20:48,432
మంచి నిర్ణయం.

1077
01:20:50,434 --> 01:20:52,436
కేజీబీ ట్రెయినింగ్ లో బాగానే నేర్చుకున్నావు.

1078
01:20:53,228 --> 01:20:58,066
ఖైదీకి పదునైన వస్తువును
ఇవ్వకూడదని కూడా నాకు ట్రెయినింగ్ లో నేర్పారు.

1079
01:21:00,694 --> 01:21:02,529
దేవుడా. నువ్వు నటిస్తున్నావని ముందే తెలుసు నాకు.

1080
01:21:02,613 --> 01:21:04,781
- తెలుసా నీకు?
- తెలీదు, కానీ అయ్య బాబోయ్.

1081
01:21:04,865 --> 01:21:07,576
- నిన్ను నేనింకా క్షమించలేదు.
- నేను కూడా. ఇవన్నీ ఎందుకు?

1082
01:21:07,659 --> 01:21:10,162
మనం బతికి బట్ట కడితే, వీటి సాయంతో వీడిని లేపేయవచ్చు.

1083
01:21:12,331 --> 01:21:14,124
- దీనికి సిద్ధంగా ఉన్నావా?
- లేదు.

1084
01:21:22,966 --> 01:21:24,051
ఇదేం చోటు?

1085
01:21:24,134 --> 01:21:28,597
కేజీబీ రహస్య చోటు.
అనధికార విచారణలు ఇక్కడ జరుగుతాయి.

1086
01:21:28,680 --> 01:21:30,098
అంటే, ఈ విచారణని వోల్కోవ్ అధికారికంగా చేయట్లేదా?

1087
01:21:30,891 --> 01:21:33,977
కొందరికి తమ సొంత ఎజెండాలు ఉంటాయి.
నీకు అది తెలుసే ఉంటుంది.

1088
01:21:34,811 --> 01:21:36,522
ఈ కేజీబీ వాళ్ళని పిలిచింది నువ్వే కదా.

1089
01:21:42,277 --> 01:21:43,278
హేయ్!

1090
01:21:58,669 --> 01:22:01,755
ఆగండి! ఆగండి!

1091
01:22:20,524 --> 01:22:23,193
- మనం ఎంబసీకి వెళదామా?
- మన కోసం అక్కడ కేజీబీ వాళ్ళు కాపు కాసి ఉంటారు.

1092
01:22:23,277 --> 01:22:25,404
మనం ఈ దేశాన్ని విడిచిపోవాలి.
అతి దగ్గర్లోని విమానాశ్రయం ఎక్కడ ఉంది?

1093
01:22:25,487 --> 01:22:27,406
షెరెమెత్యేవోలో ఉంది.
ఇక్కడి నుండి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది.

1094
01:22:27,489 --> 01:22:30,158
సరే, సరే. మనకి కారు కావాలి.

1095
01:22:30,242 --> 01:22:32,369
కారును వాళ్ళు ఆపేస్తారు.
మనకి అంత కన్నా పెద్దది కావాలి.

1096
01:22:34,580 --> 01:22:36,540
- ట్యాంక్ ని దొంగిలించాలనుకుంటున్నావా?
- ట్యాంక్ ని పేల్చేస్తారు.

1097
01:22:36,623 --> 01:22:38,292
వాళ్ళు దేన్నైనా పేల్చేయగలరు.

1098
01:22:40,919 --> 01:22:41,920
దేన్ని అయినా కాదు.

1099
01:22:45,591 --> 01:22:46,592
వద్దయ్యా.

1100
01:22:46,675 --> 01:22:49,344
అణు మిస్సైల్ ని షూట్ చేయకపోవచ్చు వాళ్ళు.

1101
01:22:50,304 --> 01:22:51,972
- చేయకపోవచ్చా?
- హేయ్!

1102
01:23:14,953 --> 01:23:17,581
- అతనికేం చెప్పావు?
- వాళ్ళు ఒక చంటి బిడ్డని తొక్కేశారని చెప్పా.

1103
01:23:17,664 --> 01:23:21,126
ఆ ఐడియా వచ్చిందా మహానుభావా నీకు?
నీకు, చంటి బిడ్డలంటే పడదా ఏంటి?

1104
01:23:23,212 --> 01:23:24,213
హేయ్!

1105
01:23:36,183 --> 01:23:37,309
ఓరి దేవుడా.

1106
01:23:42,356 --> 01:23:44,107
కారు దిగండి!

1107
01:23:44,191 --> 01:23:48,195
యూనిట్లన్నీ ఆ మిస్సైల్ క్యారియర్ ని
అడ్డుకొనే పనిలోనే ఉండాలి.

1108
01:23:48,278 --> 01:23:50,447
దానిపైకి ఎవరూ కాల్పులు జరపకూడదు!

1109
01:24:08,090 --> 01:24:10,342
- అది నీకు కనిపిస్తోంది కదా?
- హా, కనిపిస్తోంది.

1110
01:24:38,579 --> 01:24:39,997
బస్సు, బస్సు. బస్సు ఉంది, చూసుకో!

1111
01:25:12,112 --> 01:25:13,780
మనం విభేదాలను పరిష్కరించుకోవాలేమో.

1112
01:25:13,864 --> 01:25:15,365
పరిష్కరించుకోవడానికి ఏముంది, ట్రాయ్?

1113
01:25:15,449 --> 01:25:17,951
నిన్ను కాపాడటానికి నా జీవితాన్ని
పణంగా పెట్టాను, కానీ నువ్వు వెన్నుపోటు పొడిచావు.

1114
01:25:18,035 --> 01:25:21,830
జోక్ బాగుంది! నువ్వు కూడా
నాకు బాగా లోతుగా పొడిచావు వెన్నుపోటు.

1115
01:25:22,497 --> 01:25:26,001
నీకు ఆశ్రయం ఇవ్వమని కోరా, కుదరదని
వాళ్ళన్నారు. దానికి నువ్వు నన్ను పట్టించేశావు.

1116
01:25:26,084 --> 01:25:28,212
మీ దేశం మనల్ని కాపాడుతుందని నువ్వు మాటిచ్చావు.

1117
01:25:28,295 --> 01:25:31,215
కానీ, నా దేశం అంత గొప్పది కాదని తేలింది.

1118
01:25:31,298 --> 01:25:34,051
వాళ్ళు మా నాన్నను పట్టించుకోలేదు,
అలాగే నన్ను, నిన్ను కూడా పట్టించుకోరు.

1119
01:25:44,394 --> 01:25:45,687
చూడు, నిజాయితీగా…

1120
01:25:46,480 --> 01:25:48,565
నిజాయితీగా చెప్పాలంటే,

1121
01:25:49,358 --> 01:25:51,235
ఎలాగైనా స్వదేశానికి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నానేమో.

1122
01:25:54,112 --> 01:25:56,073
బహుశా నేను స్వార్థపరుడినేమో.

1123
01:26:02,287 --> 01:26:05,249
నువ్వు నా మిత్రుడివి కాబట్టి నీకు చెప్పి ఉండాల్సింది.

1124
01:26:06,333 --> 01:26:07,793
మిత్రులంటే అలాగే ఉంటారు.

1125
01:26:11,588 --> 01:26:12,798
చేయి తీయవయ్యా.

1126
01:26:42,494 --> 01:26:44,746
సరే, నన్ను అసాసిన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

1127
01:26:47,332 --> 01:26:50,377
జూనియర్ లెఫ్టినెంట్ గా ఉన్నప్పుడు, యుద్ధ విమానాన్ని
మొదటిసారి క్యారియర్ నౌకపై ల్యాండ్ చేసినప్పుడు,

1128
01:26:50,460 --> 01:26:51,461
నేను…

1129
01:26:52,337 --> 01:26:54,548
చాలా గర్వంగా ఫీల్ అయిపోయా.

1130
01:26:55,174 --> 01:26:56,592
యుద్ధ విమానం దిగి,

1131
01:26:57,092 --> 01:26:59,052
ముందూ వెనుకా చూసుకోకుండా నడుస్తూ ఉండగా,

1132
01:27:00,387 --> 01:27:02,806
వెనక్కి ముడ్డి మీద డెక్ హ్యాచ్ లో పడిపోయాను.

1133
01:27:03,932 --> 01:27:05,517
ఇద్దరు మెయింటెనెన్స్ వాళ్ళు సాయపడి నన్ను లేపారు.

1134
01:27:05,601 --> 01:27:08,061
కొంపదీసి నేను పడటం ఎవరైనా
చూశారా అని చుట్టూ చూశా, ఇక…

1135
01:27:09,563 --> 01:27:10,939
కర్మ కొద్దీ, మళ్ళీ పడ్డా.

1136
01:27:12,149 --> 01:27:14,401
మళ్ళీ అదే హ్యాచ్ లో ముడ్డి మీద పడ్డా.

1137
01:27:15,360 --> 01:27:16,486
నాకు అర్థం కాలేదు.

1138
01:27:16,987 --> 01:27:19,323
నేను ముడ్డి మీద పడ్డా.
ముడ్డి అంటే ఇంగ్లీషులో "యాస్" కదా.

1139
01:27:20,240 --> 01:27:21,742
రెండుసార్లు పడ్డా. అర్థమైందా?

1140
01:27:22,326 --> 01:27:24,077
"యాస్", "యాస్", "ఇన్".

1141
01:27:27,748 --> 01:27:28,999
అయ్యయ్యో, పెద్ద అవమానమే ఎదురైంది.

1142
01:27:29,082 --> 01:27:33,295
విషయం ఏంటంటే, సర్వీసులో ఉన్న వాళ్లకి కాకుండా
బయటి వాళ్ళకి ఎవరికీ ఆ సంఘటన గురించి నేను చెప్పలేదు.

1143
01:27:34,463 --> 01:27:36,507
కానీ ఒక గుర్తుగా దాని గురించి నీకు చెప్తున్నాను.

1144
01:27:38,050 --> 01:27:39,384
దేనికి గుర్తుగా?

1145
01:27:39,468 --> 01:27:40,844
నమ్మకానికి.

1146
01:27:42,596 --> 01:27:45,557
నువ్వు ఎదుర్కొన్న ఈ పరాభవం గురించి
నేనెవరికీ చెప్పనని నమ్ముతున్నావా?

1147
01:27:46,767 --> 01:27:47,768
అవును.

1148
01:27:54,525 --> 01:27:56,068
ఇంకో మీట నొక్కబోతున్నావా ఏంటి?

1149
01:27:56,151 --> 01:27:58,278
నీ రహస్యాన్ని నాకు చెప్పినందుకు థ్యాంక్స్,

1150
01:27:58,946 --> 01:28:00,072
"యాస్"-"యాస్"-"ఇన్".

1151
01:28:03,700 --> 01:28:05,285
అలా కాకుండా, కాస్త ఫాస్ట్ గా చెప్పవచ్చు.

1152
01:28:07,246 --> 01:28:08,622
"యాస్"-"యాస్"-"ఇన్".

1153
01:28:08,705 --> 01:28:09,831
అసాసిన్.

1154
01:28:10,415 --> 01:28:12,084
ఆ బ్రిడ్జ్ కింద మన బండి పట్టదు.

1155
01:29:00,507 --> 01:29:03,510
- ప్రైవేట్ జెట్స్ ఎక్కడ ఉన్నాయి?
- ప్రైవేట్ విమానాలు వునూకొవో నుండి బయలుదేరుతాయి.

1156
01:29:03,594 --> 01:29:04,678
అదెక్కడ?

1157
01:29:05,304 --> 01:29:06,722
అక్కడికి ఇంకో గంట పడుతుంది.

1158
01:29:09,057 --> 01:29:10,809
అయితే, మనం కమర్షియల్ విమానంలో వెళ్ళాలి అన్నమాట.

1159
01:29:18,901 --> 01:29:22,112
లోపల నా బిడ్డ ఉంది! లోపల నా బిడ్డ ఉంది!

1160
01:29:26,742 --> 01:29:28,327
అబ్బా!

1161
01:29:28,410 --> 01:29:29,786
అబ్బా!

1162
01:29:29,870 --> 01:29:30,704
నా వెంటే రండి!

1163
01:29:30,787 --> 01:29:32,831
- ఎందుకు ఆ పనిచేశావు?
- ఏం మాట్లాడుతున్నావు?

1164
01:29:32,915 --> 01:29:35,334
- బుల్లెట్ ని నీకు తగలకుండా ఆపాను.
- నీ మొహం ఆపావు.

1165
01:29:35,417 --> 01:29:38,420
ఇద్దరికీ తగిలింది. చేతితో బుల్లెట్ ని ఆపలేవు బాబూ.

1166
01:29:38,504 --> 01:29:40,589
ఇప్పుడు తెలిసిందిలే. అప్పుడు కూడా తెలుసనుకో.

1167
01:29:52,935 --> 01:29:54,895
క్యాబిన్ డోరుకు దగ్గరగా తీసుకుపో.

1168
01:29:57,773 --> 01:29:58,774
ఇంకా దగ్గరగా!

1169
01:29:59,691 --> 01:30:01,109
వెళ్లి ఆ డోర్ సంగతి చూస్తావా?

1170
01:30:18,710 --> 01:30:20,420
వీడేంటిరా నాయనా ఇలా తగులుకున్నాడు?

1171
01:30:38,897 --> 01:30:39,731
హేయ్!

1172
01:31:38,582 --> 01:31:39,750
నువ్వు చచ్చాక,

1173
01:31:40,417 --> 01:31:42,252
నీ కూతురిని వెతికి పట్టుకుని,

1174
01:31:42,336 --> 01:31:43,795
దాన్ని కూడా చంపేస్తా!

1175
01:31:47,299 --> 01:31:49,426
నువ్వు దేశద్రోహివి, పిచ్చోడివి!

1176
01:31:55,098 --> 01:31:56,642
లేదు, వోల్కోవ్.

1177
01:31:56,725 --> 01:31:58,727
నీ మక్కెలే విరగ్గొడతా.

1178
01:31:59,353 --> 01:32:00,771
వీడు చెప్పింది అదేనా?

1179
01:32:09,238 --> 01:32:10,989
వాడు చచ్చాడని నాకనిపించడం లేదు.

1180
01:32:11,073 --> 01:32:12,783
విమానాన్ని ఎవరు నడుపుతున్నారు బాబూ?

1181
01:32:12,866 --> 01:32:14,535
ఆటోపైలట్ లో పెట్టి వచ్చా.

1182
01:32:15,619 --> 01:32:17,037
ఏదో నొక్కి వచ్చా.

1183
01:32:24,711 --> 01:32:26,213
ఫిన్లాండ్ ఎంత దూరంలో ఉంది?

1184
01:32:26,839 --> 01:32:27,840
చాలా దూరం అది.

1185
01:32:28,507 --> 01:32:30,384
ఆ ఇంజిన్ పాడైపోయినప్పుడే, మన వేగం కూడా తగ్గిపోయింది.

1186
01:32:30,467 --> 01:32:32,970
మనం ఫిన్లాండ్ కి చేరుకోలేం. అంత ఇంధనం లేదు.

1187
01:32:33,053 --> 01:32:35,973
- మరి ఎక్కడి దాకా వెళ్ళగలం?
- బాల్టిక్ సముద్రం మధ్య దాకా.

1188
01:32:37,641 --> 01:32:39,434
లేదా కార్ల్ విన్సన్ ఆచూకీని కనుగొన్నా పర్వాలేదు.

1189
01:32:39,518 --> 01:32:41,395
ఆయన ఎవరు? ఆయన ఎలా మనకి సాయపడగలడు?

1190
01:32:41,478 --> 01:32:43,355
అతను మనిషి కాదు. అంటే, ఒకప్పుడు మనిషే అనుకో.

1191
01:32:44,022 --> 01:32:45,274
ఇప్పుడొక యుద్ధ విమానాల క్యారియర్ నౌక పేరది.

1192
01:32:45,357 --> 01:32:47,150
ఇంత పెద్ద విమానం, క్యారియర్ నౌకపై ల్యాండ్ అవ్వగలదా?

1193
01:32:47,985 --> 01:32:49,862
టెక్నీకల్ గా కాలేదు, కానీ ఫిజికల్ గా,

1194
01:32:50,571 --> 01:32:51,572
కాకపోవచ్చు.

1195
01:32:54,992 --> 01:32:59,037
కెప్టెన్, నేను టాక్టికల్ యాక్షన్స్ ఆఫీసర్ ని.
గుర్తుతెలీని విమానం 110 దిశ నుండి వస్తోంది,

1196
01:32:59,121 --> 01:33:00,539
32 కి.మీ దూరంలో, 5000 అడుగుల ఎత్తులో ఉంది.

1197
01:33:00,622 --> 01:33:02,082
- సైనిక విమానమా?
- కాదు, సర్.

1198
01:33:02,165 --> 01:33:04,501
- అది గుర్తు తెలీని కమర్షియల్ విమానం, సర్.
- సరే, వాళ్ళని ఒకసారి పలకరించు.

1199
01:33:04,585 --> 01:33:07,045
285 దిశలో వస్తున్న గుర్తు తెలీని విమానమా,

1200
01:33:07,129 --> 01:33:09,923
నువ్వు అంతర్జాతీయ సముద్రంలో సంచరిస్తున్న
యుఎస్ యుద్ధ నౌకని సమీపిస్తున్నావు.

1201
01:33:10,007 --> 01:33:12,009
నువ్వెవరో, నీ ఉద్దేశం ఏంటో చెప్పు.

1202
01:33:12,092 --> 01:33:15,179
నేను యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన
లెఫ్టినెంట్ ట్రాయ్ కెల్లీని.

1203
01:33:15,262 --> 01:33:19,099
మేము ఎమర్జెన్సీగా వస్తున్నాం, ల్యాండ్
అవ్వడానికి డెక్ ని సిద్ధపరచాల్సిందిగా కోరుతున్నాం.

1204
01:33:19,183 --> 01:33:22,269
గుర్తు తెలీని విమానమా, వెంటనే దిశని మార్చు,

1205
01:33:22,352 --> 01:33:23,896
లేదా మేము ఆత్మరక్షణ చర్యలకు దిగాల్సి వస్తుంది.

1206
01:33:23,979 --> 01:33:24,980
- అయ్య బాబోయ్.
- ఏమైంది?

1207
01:33:25,063 --> 01:33:27,441
వాళ్ళ మాటలు మనకి వినిపిస్తున్నాయి,
కానీ మన మాటలు వాళ్లకి చేరడం లేదు.

1208
01:33:28,609 --> 01:33:31,111
దాని దగ్గరికి వెళ్లి చూడండి.
అయిదవ కేటగిరీ హెచ్చరికగా మార్క్ చేయండి.

1209
01:33:31,195 --> 01:33:34,031
మనం వాళ్ళతో మాట్లాడకపోతే,
మనం శత్రువులమని భావిస్తారు,

1210
01:33:34,114 --> 01:33:35,407
మనపై దాడి చేస్తారు.

1211
01:33:35,490 --> 01:33:38,827
లేదు, నేను దీన్ని బాగు చేయగలను.
ఎంత సమయం ఉంది మనకి?

1212
01:33:38,911 --> 01:33:40,913
మనల్ని కూల్చేలోపు రిపేర్ చేసేయవయ్యా.

1213
01:33:48,712 --> 01:33:51,632
స్కోపా ఎయిర్, దిశని మార్చి,
సందేశం అందినట్టు నిర్ధారించు.

1214
01:33:51,715 --> 01:33:54,551
- రిపేర్ పని ఎలా సాగుతోంది?
- నా ఇంట్లోని రేడియో కంటే కాస్త క్లిష్టంగా ఉంది.

1215
01:33:55,427 --> 01:33:57,679
కెప్టెన్, ఇంటర్పోల్ నుండి ఒక హెచ్చరిక వచ్చింది.

1216
01:33:57,763 --> 01:34:01,266
కమర్షియల్ ఏటీఆర్ 42 విమానాన్ని ఒక గంట క్రితం
షెరెమెత్యేవో నుండి ఇద్దరు సాయుధులు హైజాక్ చేశారట.

1217
01:34:01,350 --> 01:34:04,394
టాక్టికల్ యాక్షన్స్ ఆఫీసర్, డెక్ పై
ఆయుధాలన్నింటినీ సిద్ధంగా ఉంచండి.

1218
01:34:16,323 --> 01:34:18,075
- వాళ్ళు వెళ్లిపోతున్నారు.
- మంచిదేలే.

1219
01:34:18,158 --> 01:34:19,993
మంచిది కాదు. వాళ్ళు అడ్డు తప్పుకుంటున్నారు.

1220
01:34:25,207 --> 01:34:27,459
ట్రాక్ 141ని శత్రువిమానంగా పరిగణిస్తున్నాం.

1221
01:34:27,543 --> 01:34:28,502
వెపన్స్ రిమోట్ గా ప్రయోగిస్తున్నాం.

1222
01:34:28,585 --> 01:34:29,837
బ్యాటరీల రిలీజ్ కోసం అనుమతి కావాలి.

1223
01:34:29,920 --> 01:34:32,798
- అనుమతి మంజూరు…
- మళ్ళీ చెప్తున్నా. నేను లెఫ్టినెంట్ ట్రాయ్ కెల్లీని.

1224
01:34:32,881 --> 01:34:36,218
- ఆ చర్యని ఆపండి.
- 7741. నేను విధిలో ఉండగా తప్పిపోయిన సిపాయిని. వినిపిస్తోందా?

1225
01:34:40,097 --> 01:34:41,223
పునఃస్వాగతం, లెఫ్టినెంట్.

1226
01:34:43,600 --> 01:34:45,477
ప్రమాదంలో ఉన్నాం!

1227
01:34:45,561 --> 01:34:48,480
ఇంధనం కనిష్ఠ స్థాయి కన్నా తక్కువ ఉంది.
ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వండి. ఓవర్.

1228
01:34:49,064 --> 01:34:50,774
టెయిల్ హుక్ లేకుండా అది సాధ్యమేనా?

1229
01:34:50,858 --> 01:34:52,150
అతనికి మతి పోయింది.

1230
01:34:52,234 --> 01:34:54,319
ఏటిఆర్-42 రెక్కల పొడవు ఎంత?

1231
01:34:54,403 --> 01:34:55,404
ఎనభై ఒక్క అడుగులు, సర్.

1232
01:34:56,154 --> 01:34:58,490
కష్టమే కానీ, అసాధ్యం కాదు.

1233
01:35:00,242 --> 01:35:01,243
నేను కెప్టెన్ ని మాట్లాడుతున్నా.

1234
01:35:01,326 --> 01:35:04,079
ఫ్లైట్ డెక్ పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరగనుంది.

1235
01:35:04,162 --> 01:35:05,706
నౌక వేగాన్ని పెంచాలి.

1236
01:35:09,793 --> 01:35:12,421
స్కోపా ఎయిర్ 1628, నువ్వు ల్యాండింగ్ చేయవచ్చు.

1237
01:35:14,339 --> 01:35:16,300
అభినందనలు, ట్రాయ్.

1238
01:35:18,218 --> 01:35:19,887
నువ్వు స్వదేశానికి వెళ్ళిపోతున్నావు.

1239
01:35:21,180 --> 01:35:22,598
అవును.

1240
01:35:36,653 --> 01:35:39,156
కెప్టెన్, నేను ల్యాండ్ అయ్యే ముందు,
మీరు నాకొక విషయంలో సహాయపడాలి.

1241
01:35:39,698 --> 01:35:40,532
అదేంటో చెప్పండి.

1242
01:35:40,616 --> 01:35:45,829
నికోలాయ్ ఉస్తినోవ్ అనే సోవియెట్ పౌరునికి
మీరు శాశ్వత ఆశ్రయం కల్పించాలి.

1243
01:35:45,913 --> 01:35:46,747
ఏంటి?

1244
01:35:46,830 --> 01:35:48,999
దాన్ని కల్పించే అధికారం నాకు లేదు.

1245
01:35:49,082 --> 01:35:51,960
అయితే, ఆ అధికారమున్న ప్రభుత్వాధికారిని సంప్రదించండి,

1246
01:35:52,044 --> 01:35:53,212
ఎందుకంటే, ఇది ఒకసారి వినండి.

1247
01:35:53,295 --> 01:35:55,422
ఇంధనం 20 కిలోలే మిగిలి ఉంది.

1248
01:35:55,506 --> 01:35:57,883
నాకు అర్థం కావట్లేదు.
ల్యాండింగ్ చేయడానికి అధికారం ఇచ్చా కదా.

1249
01:35:57,966 --> 01:36:01,762
నేను అడిగింది ఇచ్చేదాకా, ల్యాండ్ అవ్వడానికి
మీరు ఇచ్చిన అనుమతిని సగౌరవంగా తిరస్కరిస్తున్నా.

1250
01:36:01,845 --> 01:36:03,055
పదిహేను కిలోలే ఉంది.

1251
01:36:03,138 --> 01:36:04,473
వీడు పరమ దరిద్రుడు.

1252
01:36:04,556 --> 01:36:05,974
అతను విధిలో ఉండగా తప్పిపోయిన అమెరికన్ సిపాయి కూడా.

1253
01:36:06,058 --> 01:36:08,268
అసిస్టెంట్ డైరెక్టర్ మెడోస్ కి లైన్ కలపండి.

1254
01:36:08,352 --> 01:36:09,186
త్వరగా.

1255
01:36:10,521 --> 01:36:12,189
ఎందుకిలా చేస్తున్నావు?

1256
01:36:12,272 --> 01:36:16,068
ఎందుకంటే, నా దేశం పేరు నిలబెట్టాలంటే, ఆ పేరు
నిలబెట్టేలా చర్య తీసుకోవడం తప్ప ఇంకో దారి లేదు.

1257
01:36:20,197 --> 01:36:21,490
థ్యాంక్యూ.

1258
01:36:25,827 --> 01:36:27,538
ఇంధనం అయిపోయింది, కెప్టెన్.

1259
01:36:37,673 --> 01:36:40,759
కెల్లీ, నేను స్టేట్ డిపార్టుమెంట్ లో
పని చేసే కెరెన్ మెడోస్ ని.

1260
01:36:40,843 --> 01:36:43,887
కొన్సల్ జనరల్ హెనెస్సీ, మీ పరిస్థితి గురించి వివరించారు.

1261
01:36:43,971 --> 01:36:46,765
ఇలా నన్ను బెదిరించి
పని చేయించుకోవడం నాకస్సలు నచ్చదు,

1262
01:36:46,849 --> 01:36:49,017
అది కూడా ఉదయాన్నే అయిదు గంటలకు.

1263
01:36:49,101 --> 01:36:50,561
అర్థమైంది, మేడమ్. తెల్లవారే లేపినందుకు సారీ.

1264
01:36:50,644 --> 01:36:52,396
కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని,

1265
01:36:52,479 --> 01:36:55,440
ఆశ్రయమివ్వమని చేసిన విన్నపానికి
నేను అధికారికంగా సమ్మతిస్తున్నాను.

1266
01:36:56,066 --> 01:36:58,610
మీ సర్వీసుకు ధన్యవాదాలు, లెఫ్టినెంట్.

1267
01:36:59,611 --> 01:37:01,655
ఇక ఆ విమానాన్ని త్వరగా దించు.

1268
01:37:03,532 --> 01:37:04,992
నా కోసం నీ ప్రాణాలను లెక్క చేయలేదు నువ్వు.

1269
01:37:06,034 --> 01:37:08,579
కొంచెం అంతే అనుకో. ఇక్కడ
రిజర్వ్ ఇంధన ట్యాంక్ కూడా ఉంది.

1270
01:37:29,057 --> 01:37:30,392
రెక్కలని 30 డిగ్రీలకు సెట్ చేస్తున్నా.

1271
01:37:30,475 --> 01:37:33,395
కండిషన్ లివర్స్ ని గరిష్ఠ స్థాయికి సెట్ చేశా.
మధ్య భాగంలో ల్యాండ్ అవుతోంది.

1272
01:37:33,937 --> 01:37:36,648
నా ఫేవరెట్ సినిమాలో ఉన్నట్టుంది నాకు.

1273
01:38:10,098 --> 01:38:11,892
- హేయ్, ట్రాయ్.
- ఏంటి?

1274
01:38:12,893 --> 01:38:14,811
నువ్వు ఎప్పుడైనా నా పార్టనర్ గా ఉండవచ్చు…

1275
01:38:14,895 --> 01:38:16,647
వద్దు, వద్దు. ఏంటది? వద్దు.

1276
01:38:17,147 --> 01:38:18,440
వద్దు. అదేం అక్కర్లేదు.

1277
01:38:19,024 --> 01:38:20,150
అర్థం చేసుకోగలనులే.

1278
01:38:27,699 --> 01:38:30,369
ఈ దేశానికి సేవలందించే అవకాశం దక్కడం,
నేవీ నినాదమైన "నాన్ సీబీ సెడ్ ప్యాట్రియాయ్",

1279
01:38:31,370 --> 01:38:35,457
అంటే "స్వలాభాన్ని వీడు, దేశం కోసం
పాటుపడు"ను నిలబెట్టే అవకాశం దక్కడం

1280
01:38:37,000 --> 01:38:38,669
భాగ్యంగా భావిస్తున్నాను.

1281
01:38:40,420 --> 01:38:41,922
కాబట్టి, సైనిక సామాగ్రి నిర్మాణాల్లో

1282
01:38:42,005 --> 01:38:44,675
క్యాన్సర్ కారకాలను ప్రభుత్వం ఉపయోగిస్తోందని
మీరు ప్రజల ముందు తీసుకురాగలరని

1283
01:38:44,758 --> 01:38:49,054
నాకు పూర్తి నమ్మకంగా ఉంది.

1284
01:38:55,561 --> 01:38:59,147
అంతే కాకుండా, మన క్షేమం కోసం
తమ ఆరోగ్యాన్ని త్యాగం చేసిన

1285
01:38:59,231 --> 01:39:01,650
మా నాన్నకి, అలాగే ఎంతో మంది మంచి వారికి
సరైన పరిహారం అందించడానికి

1286
01:39:02,234 --> 01:39:05,362
పరిహార కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.

1287
01:39:08,615 --> 01:39:09,741
థ్యాంక్యూ, లెఫ్టినెంట్.

1288
01:39:09,825 --> 01:39:12,119
ఈ దేశం మీకు రుణపడి ఉంటుంది,

1289
01:39:12,202 --> 01:39:14,830
మీ రిక్వెస్ట్ ని మేము సీరియస్ గా తీసుకుంటాం.

1290
01:39:18,458 --> 01:39:19,501
సారీ.

1291
01:39:19,585 --> 01:39:22,713
ఈ ట్రిక్కును నేను
రష్యన్ బాయ్ స్కౌట్స్ నుండి నేర్చుకున్నాను.

1292
01:39:22,796 --> 01:39:25,507
నా దగ్గర ఇది ఉందని మీకు చెప్పి ఉండాల్సిందేమో నేను.

1293
01:39:26,258 --> 01:39:28,177
ఇది 1956లో నేవీ సెక్రటరీ

1294
01:39:28,260 --> 01:39:30,762
రాసిన రహస్య లేఖకు కాపీ,

1295
01:39:30,846 --> 01:39:35,851
ఇందులో షిప్ యార్డులో పని చేసే వారు, ఆస్బెస్టాస్ కారణంగా
అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని ప్రస్తావించారు.

1296
01:39:36,977 --> 01:39:39,521
అసలైన కాపీని ఒక చోట పెట్టాను.
కానీ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు.

1297
01:39:39,605 --> 01:39:42,191
కానీ ఇది చిన్నా చితక విషయం కాదు.
చాలా నష్టం కలిగించేస్తుంది.

1298
01:39:43,817 --> 01:39:44,943
శభాష్.

1299
01:39:45,485 --> 01:39:47,196
మెక్ డొనల్డ్స్

1300
01:39:49,990 --> 01:39:52,868
ఎలా ఉంది బిగ్ మ్యాక్ బర్గర్?
నువ్వు అనుకున్నట్టే ఉందా?

1301
01:39:53,493 --> 01:39:56,705
అమెరికాలా ఉంది.

1302
01:39:56,788 --> 01:39:59,166
హా. ఎప్పుడు బయలుదేరుతున్నావు?

1303
01:39:59,249 --> 01:40:00,083
తెల్లవారు జామున.

1304
01:40:00,167 --> 01:40:02,377
లిబర్టీ బెల్ లో లంచ్ చేద్దామనుకుంటున్నా.

1305
01:40:02,461 --> 01:40:04,254
అక్కడ లంచ్ చేయాలని అందరికీ ఉంటుంది.

1306
01:40:04,338 --> 01:40:05,339
చాలా బాగుంది అది.

1307
01:40:05,422 --> 01:40:06,590
అవును.

1308
01:40:07,758 --> 01:40:10,511
నీకు చాలా నెలల సెలవులు
పేరుకుపోయి ఉన్నాయని అన్నావు కదా?

1309
01:40:11,136 --> 01:40:14,306
నేను ఇచ్చిన ఝలక్ కి,
తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపొమ్మంటారేమో.

1310
01:40:14,389 --> 01:40:16,433
మరి నాతో రావచ్చుగా?

1311
01:40:16,517 --> 01:40:18,810
కిచెన్ టేబుల్ ని మడిస్తే ఇంకో బెడ్ అయిపోతుంది.

1312
01:40:18,894 --> 01:40:21,813
మొబైల్ రేడియో టెలిఫోన్ ఉంది,
దానితో ఆనాతో మాట్లాడుతూ ఉండవచ్చు.

1313
01:40:21,897 --> 01:40:23,273
నా దగ్గర క్యాసెట్ ప్లేయర్ ఉంది.

1314
01:40:23,357 --> 01:40:25,359
- నాకు ఆసక్తి లేదు.
- అర్థమైంది.

1315
01:40:25,442 --> 01:40:27,236
కానీ, ఏ దేశ రక్షణ కోసమైతే నువ్వు వీరోచితంగా పోరాడావో,

1316
01:40:27,319 --> 01:40:29,154
ఆ దేశమంతా నువ్వు తిరగాలా లేదా?

1317
01:40:31,907 --> 01:40:33,116
ఏమో అబ్బా.

1318
01:40:33,200 --> 01:40:35,911
భలే వాడివే, లెఫ్టినెంట్.

1319
01:40:37,996 --> 01:40:39,414
ఇంకొక్క సాహసం చేద్దాం.

1320
01:40:42,209 --> 01:40:44,294
నా డ్రింక్ తాగాక నిర్ణయం తీసుకుంటా.

1321
01:40:44,878 --> 01:40:45,921
తప్పకుండా.

1322
01:41:01,812 --> 01:41:02,980
నన్ను ఆటపట్టిస్తున్నావు కదా.

1323
01:41:11,071 --> 01:41:12,739
మెక్ డొనల్డ్స్

1324
01:49:26,984 --> 01:49:28,986
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్



